2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ముంబైలో బ్రేక్ ఫాస్ట్ చేసి, దుబాయ్‌లో భోజనం చేయడం సాధ్యమేనా? వినడానికి సైన్స్ ఫిక్షన్‌లా అనిపించినా, ఓ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అరేబియా సముద్రం గుండా వెళ్లే అండర్‌వాటర్ ట్రైన్ ప్రాజెక్ట్ వీడియో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ‘డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్’ అనే ట్రైన్‌ను అరేబియా సముద్రం అడుగున నిర్మించి భారత్‌ను యూఏఈతో అనుసంధానం చేయనున్నారు. ఈ రైలు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, ఇది విమానాల కంటే కూడా వేగమని వీడియోలో తెలిపారు. హైపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించే ఈ ట్రైన్ ద్వారా రెండు గంటల్లో దుబాయ్ చేరుకునే అవకాశం ఉంటుందట. అంతేకాదు అండర్‌వాటర్ సొరంగం గోడల వెంట పానోరమిక్ గ్లాస్ విండోలు అమర్చుతారు.
సముద్రంలో 200 మీటర్ల లోతులో ప్రయాణిస్తూ, బయట షార్క్‌లు, తిమింగలాలు, చేపల గుంపులు ఈదుతూ కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద అండర్‌వాటర్ అక్వేరియంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. ఈ అండర్ వాటర్ సొరంగం ద్వారా దుబాయ్ నుంచి భారత్‌కు క్రూడ్ ఆయిల్ తరలిస్తారు. భారత్ నుంచి దుబాయ్‌కు తాగు నీటిని పంపిస్తారు. ఇలా ఒకేసారి రెండు కీలక సమస్యలకు పరిష్కారం చూపేలా ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 50 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ కానుంది. అయితే దీని వల్ల 50 వేలకుపైగా ఉద్యోగాలు సృష్టి అవుతాయని, ముంబై అంతర్జాతీయ హబ్‌గా మారుతుందని, భారత్–యూఏఈ మధ్య ప్రయాణ ఖర్చులు 60 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే భారత్, యూఏఈ ప్రభుత్వాల మధ్య ఇప్పటికే చర్చలు మొదలైనట్టు సమాచారం. 2030 నాటికి ఇది వాస్తవ రూపం దాలిస్తే, రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
