వంటకాల్లో వాడే కరివేపాకును చాలామంది పక్కన పడేస్తుంటారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం ఇది అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు వంటి పోషకాలతో నిండిన కరివేపాకు మధుమేహం, కొలెస్ట్రాల్ నియంత్రణ, జీర్ణక్రియ, బరువు తగ్గడం, జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరమని పరిశోధనలు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.