2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు వీడియో
2025లో కొన్ని విషాద ఘటనలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసాయి. కుంభమేళా తొక్కిసలాట నుంచి ఎయిర్ ఇండియా ఘటనలపై ఓసారి లుక్ వేద్దాం పదండి. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు కోట్లాది మంది వచ్చి గంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే జనవరి 29న విశేష రోజైన మౌని అమావాస్య స్నానాలకు లక్షలాది మంది ఒక్కసారిగా పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా 60 మంది గాయపడ్డారు. గుంపును అదుపు చేయడంలో అధికారులు విఫలమయ్యారు.
కుంభమేళా సందర్భంగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్ వెళ్లడానికి ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు భారీగా జనం వచ్చారు. ప్లాట్‌ఫామ్ 15కి వెళ్లే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై రద్దీ పెరిగింది. ప్రయాణికులు తలపై భారీ సంచులను మోసుకెళ్లారు. అదే సమయంలో.. ఒక ప్రయాణికుడి తలపై ఉన్న భారీ లగేజీ అదుపుతప్పి కిందపడింది. దీంతో ఆయన దాన్ని తీసేందుకు కిందకు వంగడం..దీని వల్ల వంతెనపై ప్రయాణికుల కదలికలకు ఆటంకం ఏర్పడటం, ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటానికి దారితీసింది. పెద్ద ప్రాణనష్టం జరగ్గా 18 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.ఏప్రిల్ 22న పహల్గాంలో అమాయక టూరిస్టులపై ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కళ్ల ముందే తమ వారిని ఉగ్రవాదులు కాల్చి చంపుతుంటే.. మహిళలు పిల్లలు కన్నీరు పెట్టుకున్నారు. 26 మంది చనిపోయారు. విషాదం ఏంటంటే.. కొత్తగా పెళ్లైన రెండు జంటలు లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, హిమాన్షి అలాగే శుభమ్ ద్వివేది ఆషన్య ద్వివేది ఎంచక్కా ఎంజాయ్ చేయాలని హనీమూన్ కోసం వచ్చారు. వారిని ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఆ జంటల్లో మగవారిని చంపేశారు. ఫలితంగా కాళ్ల పారాణి ఆరక ముందే కొత్త పెళ్లికూతుళ్లు విధవరాళ్లుగా మారారు. జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన భర్తలు చనిపోవడంతో.. మృతదేహాల పక్కనే కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించారు. దేశ ప్రజల ప్రతీ ఒక్కరి గుండెని ఆ ఫొటోలు కదలించాయి.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
