సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
మొన్న హీరోయిన్ నిధి అగర్వాల్‌కు జరిగినట్లుగా హైదరాబాద్‌లో ఓ షోరూమ్ ఓపెనింగ్ కు వచ్చిన స్టార్ హీరోయిన్ సమంతకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఓపెనింగ్ తర్వాత సమంత బయటకు వచ్చి తన కారు దగ్గరికి వెళుతుండగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఆమెను చుట్టుముట్టి సెల్ఫీల కోసం ప్రయత్నించారు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి, ఆమె కారు వరకు వెళ్లడం కష్టంగా మారింది. తన వ్యక్తిగత సెక్యూరిటీ సాయంతో అతికష్టం మీద అక్కడి నుంచి సమంత బయటపడ్డారు. అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
డిసెంబర్ ఒకటో తేదీన వివాహ బంధంలోకి అడుగు పెట్టింది సమంత. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సైలెంట్ గా కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో రెండో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత బయట పెద్దగా కనిపించని సమంత, తాజాగా భర్త రాజ్ నిడిమోరు తో మెరిసింది. ముంబై నుంచి వచ్చిన సమంతకు శంషాబాద్ విమానాశ్రయంలో వెల్‌కమ్ చెప్పారు రాజ్. రాజ్ కారు డ్రైవ్ చేస్తుండగా సమంత అతని పక్కన కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, నిర్మాతగా కొనసాగుతున్నారు. ట్రాలాలా పతాకంపై సమంత నిర్మాతగా ‘మా ఇంటి బంగారం’ రూపొందుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

