అన్ని సీజన్లలో లభించే అరటిపండు తక్షణ శక్తినిస్తుంది. అయితే, దానిని ఏ సమయంలో తింటున్నామనే దానిపై దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఉదయం, వ్యాయామానికి ముందు, రాత్రిపూట తీసుకోవడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడానికి గింజలు లేదా పెరుగుతో తినడం మంచిది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు పరగడుపున అరటిపండు తినకూడదు.