మినుములు తినడం వల్ల శరీరం ఇనుములా బలపడుతుందని పెద్దలు అంటారు. 100 గ్రాముల మినుముల్లో ఫైబర్, పొటాషియం, విటమిన్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, ఎముకల ఆరోగ్యం, రక్తహీనత నివారణ, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గుండె, నాడుల వ్యవస్థకు కూడా బలాన్నిస్తాయి.