AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడేనా.. చిన్ననాటి కోచ్ ఏమన్నాడంటే..?

Team India: సచిన్ టెండూల్కర్ తన 38వ ఏట 2011 ప్రపంచకప్ గెలిచినట్లుగా, విరాట్ కోహ్లీ కూడా 2027లో భారత్‌కు కప్పు అందించి తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోచ్ రాజ్ కుమార్ శర్మ ఇచ్చిన ఈ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కోహ్లీ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది.

Virat Kohli: విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడేనా.. చిన్ననాటి కోచ్ ఏమన్నాడంటే..?
Virat Kohli Century
Venkata Chari
|

Updated on: Dec 25, 2025 | 1:25 PM

Share

Virat Kohli: టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ భవిష్యత్తు గురించి గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20లు, టెస్ట్ క్రికెట్‌కు (మే 2025లో) రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో, 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కనిపిస్తాడా? లేదా? అనే ప్రశ్నకు ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ సమాధానమిచ్చారు.

విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ విధ్వంసం..

దాదాపు 15 ఏళ్ల తర్వాత దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలోకి కోహ్లీ ఘనంగా పునరాగమనం చేశాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 131 పరుగులతో అద్భుతమైన సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన చూపిన ఫిట్‌నెస్, పరుగుల దాహం చూస్తుంటే వయస్సు కేవలం అంకె మాత్రమేనని మరోసారి నిరూపితమైంది.

కోచ్ రాజ్ కుమార్ శర్మ ఏమన్నారంటే?

కోహ్లీ తాజా ప్రదర్శనపై రాజ్ కుమార్ శర్మ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినా, తన క్లాస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. అతను 2027 ప్రపంచకప్ ఆడేందుకు 100 శాతం సిద్ధంగా ఉన్నాడు. భారత వన్డే జట్టులో అతనే అత్యంత నిలకడైన ఆటగాడు” అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

విరాట్ ఫిట్‌నెస్‌ పరంగా ప్రపంచంలోనే మేటి అని, అతనిలో ఇంకా పరుగుల ఆకలి తీరలేదని కోచ్ గుర్తు చేశారు. 2027 వరల్డ్ కప్ నాటికి విరాట్ వయస్సు 38 ఏళ్లు దాటినప్పటికీ, అతని బాడీ ఇంకా యువకుడిలాగే సహకరిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వన్డేలపైనే పూర్తి ఫోకస్..

రోహిత్ శర్మతో కలిసి విరాట్ ఇప్పటికే ఇతర ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో, వారిద్దరి ఏకైక లక్ష్యం 2027 వన్డే ప్రపంచకప్ అని స్పష్టమవుతోంది. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. రోహిత్, కోహ్లీలు ఫిట్‌గా ఉన్నంత కాలం జట్టుకు వారి అనుభవం ఎంతో అవసరమని, వారు ప్రపంచకప్‌లో ఆడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

సచిన్ టెండూల్కర్ తన 38వ ఏట 2011 ప్రపంచకప్ గెలిచినట్లుగా, విరాట్ కోహ్లీ కూడా 2027లో భారత్‌కు కప్పు అందించి తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోచ్ రాజ్ కుమార్ శర్మ ఇచ్చిన ఈ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కోహ్లీ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..