Lemon Water: ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్.. అమృతంతో సమానం.. రోజూ తాగితే మీ సమస్యలకు చూమంత్రం వేసినట్టే!
ఈ మధ్య కాలంలో మారుతున్న లైఫ్‌స్టైల్ ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒకటి.. మన శరీరంలో ఇది తీవ్ర రూపం దాల్చితే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్య పరిష్కారానికి చాలా మంది రకరకాల మందులను వాడుతూ ఉంటారు. కానీ మన వంటిల్లో దొరికే ఒక పండు ద్వారా దీన్ని కంట్రోల్ ఉంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. అదేంటో తెలుసుకుందాం.

అధిక రక్తపోటు.. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ఇది ఎలాంటి లక్షణాలను చూపకుండానే శరీరంలో పెరుకుపోతుంది. ఇది తీవ్ర రూపం దాల్చుతుంది. ఆ తర్వాత కొద్దికొద్దిగా శరీరంలోని ముఖ్యమైన గుండె, కిడ్నీలు వంటి అవయవాలను నాశనం చేస్తుంది. దీనికి సహజ పరిష్కారం కావాలని అడుగుతే చాలా మంది నిమ్మకాయ నీటిని తాగమని సజెస్ చేస్తారు. ఎందుకంటే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో నిమ్మకాయ చాలా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. అవును నిమ్మకాయలో విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తాన్ని శుద్ది చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తర్వాత రక్తపోటు అనేది కంట్రోల్ అవుతుంది.
NCBI అధ్యయనాల ప్రకారం, నిమ్మకాయ నీటిలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి. ఆసియన్ జర్నల్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ , నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఇది రక్త నాళాలను సడలించి శరీరంలో హైడ్రేషన్‌ను పెంచుతుంది. అయితే ఇది పూర్తి పరిష్కారం కాదు.. కేవలం అప్పటివరకు మాత్రమే దాన్ని కంట్రోల్ చేయగలదు.
హైడ్రేషన్ పెంచడం: నిమ్మకాయ నీటిని తాగడం వల్ల శరీరంలో హైడ్రేషన్‌ను పెంచుతుంది, ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి చాలా అవసరం. ఎందుకంటే ఇది ధమనులను ఆరోగ్యంగా ఉంచి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందువలన, ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి మీకు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే.. మీరు దీన్ని తాగవచ్చు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
