ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో యూకేజీ విద్యార్థి విహార్ విషాదకరంగా మరణించాడు. స్కూల్లో జారిపడినప్పుడు చేతిలోని పెన్సిల్ గొంతుకు గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.