- Telugu News Photo Gallery Business photos Business Ideas: Start A Youtube Channel To Earn Lakhs Per Month, Details Here
Business Ideas: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక
సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడం మాంచి పనే. కాసేపు నష్టం గురించి పక్కనపెడితే.. ఇందులో విజయం సాధిస్తే మనం ఆర్ధికంగా వృద్ది చెందడమే కాకుండా.. బిజినెస్‌ను మరింతగా అభివృద్ధి ఎలా చేయాలన్న దానిపై కూడా అవగాహన వస్తుంది.
Updated on: Jul 09, 2024 | 8:51 AM

సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడం మాంచి పనే. కాసేపు నష్టం గురించి పక్కనపెడితే.. ఇందులో విజయం సాధిస్తే మనం ఆర్ధికంగా వృద్ది చెందడమే కాకుండా.. బిజినెస్‌ను మరింతగా అభివృద్ధి ఎలా చేయాలన్న దానిపై కూడా అవగాహన వస్తుంది.

ఈ రోజుల్లో 9 టూ 5 ఉద్యోగం చేసేవారు కూడా మరింత ఆదాయం కోసం సైడ్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. ఒక్కసారి బిజినెస్‌లో విజయవంతం అయితే.. ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. వ్యాపారాలు చేసుకునేవారు కూడా చాలామందే ఉన్నారు. మరి మీకు కూడా అదే ప్లాన్ ఉన్నట్లయితే.? మీకోసం ఓ బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం.

యూట్యూబ్ ఛానెల్.. పేరు వినగానే ఇది మన వల్ల అవుతుందా.? అని డౌట్ పడకండి.. ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ కూడా ఓ యూట్యూబ్ ఛానెల్ మెయింటైన్ చేస్తున్నారు. మీకు వంటలు చేయడంలో నైపుణ్యం ఉందా.? ఇంకేం ఓ వీడియో కెమెరా కొనుక్కుని.. రోజూ ఓ వెరైటీ రెసిపి వీడియోను మీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు.

అలా కాదంటారా.! మీకు ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్‌పై పరిజ్ఞానం ఉంటే.. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి ఆన్‌లైన్ క్లాసులు తీసుకోవచ్చు. ఇలా ఒకటేమిటి.. ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా మీకు తెలిసిన విషయాలను మరికొందరికి పంచుకుంటూ.. డబ్బులు సంపాదించవచ్చు. ఇలా రోజుకు రెండు గంటలు కష్టపడితే చాలు.. మంచి మంచి వీడియోలను తీయొచ్చు.

ఇక యూట్యూబ్ ఛానెల్ వ్యూయర్‌షిప్ పెంచుకునేందుకు కాస్త మార్కెటింగ్ స్కిల్స్ అవసరమవుతాయి. మీకంటూ యాక్టివ్ యూజర్లతో కూడిన ఓ ఫేస్‌బుక్ పేజి లేదా ఇన్‌స్టా పేజి ఉంటే.. దాని ద్వారా మీ వీడియోలకు మరిన్ని వ్యూస్ తెప్పించుకోవచ్చు.





























