LPL 2024: దంచికొట్టిన ‘పోలీసోడు’.. 50 బంతుల్లో ఊహకందని ఊచకోత.. ఎవరీ టీ20 మాన్‌స్టర్.?
ఆదివారం కొలంబో స్ట్రైకర్స్, దంబుల్లా సిక్సర్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ పోలీసోడు తన పేలుడు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. 160 స్ట్రైక్ రేట్‌తో తన జట్టు అద్భుత విజయాన్ని అందించడంలో తోడ్పడ్డాడు. అతడి దూకుడైన బ్యాటింగ్ దెబ్బకు..
ఆదివారం కొలంబో స్ట్రైకర్స్, దంబుల్లా సిక్సర్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ పోలీసోడు తన పేలుడు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. 160 స్ట్రైక్ రేట్‌తో తన జట్టు అద్భుత విజయాన్ని అందించడంలో తోడ్పడ్డాడు. అతడి దూకుడైన బ్యాటింగ్ దెబ్బకు కొలంబో స్ట్రైకర్స్‌పై 8 వికెట్ల తేడాతో దంబుల్లా సిక్సర్లు అద్భుత విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఆ ప్లేయర్ మరెవరో కాదు.. శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా. మ్యాచ్ అనంతరం అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మొదటగా శ్రీలంకన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చీఫ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశాడు కుశాల్ పెరీరా. అయితే క్రికెట్ మీదున్న మక్కువతో అతడు.. ఈ పదవిని వదులుకున్నాడు. నిజానికి, దేశవాళీ క్రికెట్‌లో పెరీరా శ్రీలంక పోలీసు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన కొలంబో స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లకు 185 పరుగులు చేసింది. ఫిలిప్స్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక 186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దంబుల్లా సిక్సర్లకు ఓపెనర్లు ఇద్దరూ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రిజా హెండ్రిక్స్(54), కుశాల్ పెరీరా(80) మొదటి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కుశాల్ పెరీరా 160 స్ట్రైక్ రేట్‌తో కేవలం 50 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 భారీ సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. అటు రిజా హెండ్రిక్స్ 39 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 54 పరుగులు చేసింది. వీరిద్దరి పేలుడు బ్యాటింగ్‌కి కొలంబో స్ట్రైకర్స్ బౌలర్లు ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్ షాదాబ్ ఖాన్ అయితే.. 10.66 ఎకానమీతో 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. షాదాబ్ బౌలింగ్‌లో రిజా హెండ్రిక్స్ 2 సిక్సర్లు, కుశాల్ పెరీరా 1 సిక్స్ కొట్టారు.
ఇది చదవండి: పట్టాలపై ఎద్దుల భీకర ఫైట్.. అంతలో దూసుకొచ్చిన రైలు.. ఆ తర్వాత ఇది సీన్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..