Team India: టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ.. ఆటగాళ్లకు ఎంతెంత..?

తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం... ఆ మొత్తంలో మెజార్టీ భాగాన్ని ప్లేయర్లకు, అలాగే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి ఇస్తారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం ప్లేయర్లంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడనివారిని కూడా లెక్కలోకి తీసుకుంటారు. అంటే 15 మంది టీంతో పాటు హెడ్ కోచ్ ద్రవిడ్ కూడా అని అర్థం. ఇలా ఆ మొత్తం 16 మందికి ఒక్కొక్కరికీ 5 కోట్ల రూపాయల చొప్పున ఇస్తారు.

Team India: టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ.. ఆటగాళ్లకు ఎంతెంత..?
Virat Kohli, Rohit Sharma
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 08, 2024 | 12:54 PM

అక్షరాల రూ.125 కోట్లు… టీం ఇండియా టీ -20 వరల్డ్ కప్ గెల్చిన తర్వాత బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీ. అంత మొత్తం ఎనౌన్స్ చెయ్యగానే… అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతే కాదు.. ఆ తర్వాత చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. అందులో అతి ముఖ్యమైనది ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు..? అంటే 125 కోట్లను టీం ఇండియాకు ఎలా పంచుతారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. టీంకి అంటే ఆ రోజు గెల్చిన జట్టులో ఉన్న సభ్యులకా..? లేదా కోచ్‌లు, క్రికెటర్లు, ఇతర స్టాప్ ఇలా అందరికీనా..? అందరికీ సమానంగా పంచుతారా..? లేదా సీనియార్టీ ప్రకారం పంచుతారా? ఇలా ఎన్నో సందేహాలు. అయితే వాటన్నింటికీ ఓ క్లియర్ కట్ ఆన్సర్ దొరికినట్టే కనిపిస్తోంది. టీంకి రూ.125 కోట్లు ప్రకటించగా.. అందులో టీం ఇండియా ప్లేయర్లు, కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్, అలాగే సీనియర్ సెలక్షన్ కమిటి మెంబర్లు వీళ్లందరికీ కలిపి ఆ మొత్తాన్ని పంచనున్నారు. సరే అంత మందికి అన్నప్పుడు.. అందరికీ సమానంగా పంచేస్తారా..? లేదా అందులో కూడా తేడాలుంటాయా..? ఆ డీటైల్స్ కూడా చూద్దాం.

తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం… ఆ మొత్తంలో మెజార్టీ భాగాన్ని ప్లేయర్లకు, అలాగే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి ఇస్తారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం ప్లేయర్లంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడనివారిని కూడా లెక్కలోకి తీసుకుంటారు. అంటే 15 మంది టీంతో పాటు హెడ్ కోచ్ ద్రవిడ్ కూడా అని అర్థం. ఇలా ఆ మొత్తం 16 మందికి ఒక్కొక్కరికీ రూ. 5 కోట్ల రూపాయల చొప్పున ఇస్తారు. అంటే మొత్తం 16 మందికి కలిపి రూ.80 కోట్లు అన్నమాట. అయితే ఇక్కడ మొత్తం 15 మందిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్లు ముగ్గురున్నారు. వారు నెంబర్ 1 యజ్వేంద్ర చాహల్, నెంబర్ 2 సంజు శాంసన్, నెంబర్ 3 యశస్వీ జైశ్వాల్. ఈ ముగ్గురు ఒక్క గేమ్ కూడా ఆడక పోయినప్పటికీ రూ.5 కోట్లు తీసుకుంటున్న అదృష్టవంతులన్నమాట.

ఇక మిగిలిన రూ.45 కోట్లలలో ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్.. అంటే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్.. ఈ ముగ్గురికీ ఒక్కొక్కరికీ రెండున్న కోట్లిస్తారు. అంటే వారికిచ్చే మొత్తం ఏడున్నర కోట్లు. అలాగే అజిత్ అగార్కర్ నాయకత్వంలో పని చేస్తున్న సెలక్షన్ కమిటీ సభ్యులు ఒక్కొక్కరికీ కోటి రూపాలు ఇస్తారు. అంటే సెలక్షన్ కమిటీలో మొత్తం ఐదుగురు సభ్యులున్నారు. అంటే వారికిచ్చే మొత్తం రూ.5 కోట్లు.

15 మంది టీం కాకుండా నలుగురు రిజర్వ్ ప్లేయర్లు కూడా ఉన్నారు. శుభమన్ గిల్, రింకూ సింగ్, అవేష్ ఖాన్, అలాగే ఖలీల్ అహ్మద్. సో.. ఈ నలుగురికీ కూడా ఒక్కొక్కరికీ కోటి రూపాయల చొప్పున పంచనున్నానురు. అంటే ఎవరైనా గాయపడితే వారి ప్లేస్‌లో వెళ్లి ఆడేందుకు సిద్ధంగా ఉన్నందుకు కూడా ఈ నలుగురికీ కోటి నజరానా దక్కబోతోంది.

అలాగే టీం ఇండియాకు ముగ్గురు ఫిజియో థెరపిస్టులు, అలాగే ముగ్గురు త్రో డౌన్ స్పెషలిస్టులు వారితో పాటు ముగ్గురు మసర్స్ ఇంకా స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్.. ఈ పది మందికి ఒక్కొక్కరికీ రూ.2 కోట్లు ఇస్తారు. ఆటగాళ్లు, అలాగే ఇతర సపోర్టింగ్ స్టాప్ అందరూ తమ తమ ఇన్వాయిస్‌లను సబ్‌మిట్ చేసి ప్రైజ్ మనీ తీసుకోవాలని ఇప్పటికే టీం ఇండియాకు ఇన్ఫాం చేసినట్టు బీసీసీఐ వర్గాలు చెప్పినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

మొత్తం టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీం ఇండియా తరపున క్రీడాకారులు, కోచ్‌లు, సపోర్టింగ్ స్టాప్ ఇలా అంతా కలిసి మొత్తం 42 మంది వెళ్లారు. ఇంత వరకు మనం చెప్పుకున్న వారికి మాత్రమే కాకుండా వీడియో అనలిస్ట్, బీసీసీఐ స్టాప్ మెంబర్స్, మీడియా ఆఫీసర్లు, లాజస్టిక్ మేనేజర్ ఇలా వీళ్లందరికీ కూడా రివార్డ్స్ ఉండబోతున్నాయి.

అయితే వీళ్లు తీసుకునే ప్రైజ్ మనీలో 10 శాతం ట్యాక్స్‌ తప్పనిసరిగా ప్రభుత్వానికి చెల్లించాలి. సో.. టీడీఎస్ పోనూ.. మిగిలినది మాత్రమే వాళ్లకు చివరకు అందే ప్రైజ్ మనీ.

ఇక ఈ ఏడాది టీ-20 వరల్డ్ కప్ విన్నర్స్ కోసం ఐసీసీ కూడా భారీగానే ప్రైజ్ మనీ ప్రకటించింది. మొత్తంగా విజేతలకు 20 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చింది. అయితే బీసీసీ ప్రకటించిన మొత్తంతో పోల్చితే ఇది చాలా తక్కువగానే కనిపించినప్పటికీ ఐసీసీ దృష్టిలో చాలా భారీ మొత్తమే. మొత్తంగా ఈ వరల్డ్ కప్‌‌ కోసం సుమారు 90 కోట్ల ప్రైజ్ మనీ ఎనౌన్స్ చేసింది. ఈ లెక్కన టీం ఇండియాకి 20 కోట్ల 42 లక్షలు రాగా.. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకి 10 కోట్ల 67 లక్షలు లభించింది.

వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..