AP News: ఇది కదా కావాల్సింది.! సికింద్రాబాద్ టూ గోవా వెళ్లే ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్
తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది రైల్వే శాఖ. సికింద్రాబాద్ టూ వాస్కోడగామా(గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు(17039/17040) పట్టాలెక్కింది. ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 కోచ్‌లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని..
తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది రైల్వే శాఖ. సికింద్రాబాద్ టూ వాస్కోడగామా(గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు(17039/17040) పట్టాలెక్కింది. ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 కోచ్‌లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని.. అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్‌లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇదికాకుండా కాచిగూడ – యలహంక మధ్యన ప్రయాణించే డైలీ ఎక్స్‌ప్రెస్ రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 కోచ్‌లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్యన తిరిగే అమరావతి రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు.
ఇలా సికింద్రాబాద్ టూ గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలామంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో కేంద్ర రైల్వేశాఖ.. దక్షిణ మధ్య రైల్వేకి ఇటీవలే తీపికబురు అందించింది. సికింద్రాబాద్ టూ వాస్కోడగామా(గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ నిర్ణయానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధాని మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే వాస్కోడగామా నుంచి గురు, శనివారాల్లో తిరుగు ప్రయాణమవుతుంది. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్‌పేట్, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. ఇంకా ఈ ట్రైన్ టికెట్ ధరలు, ఎప్పటినుంచి అందుబాటులోకి రానుందో తెలియాల్సి ఉంది.
ఇది చదవండి: సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..