Business Ideas: రూ. 50 వేలతో నెలకు రూ. లక్షల్లో సంపాదించొచ్చు.. రిస్క్‌ లేని వ్యాపారాలు

చేస్తోన్న ఉద్యోగంతో విసిగిపోయారా.? చాలీచాలనంత జీతం మీ నిత్యావసరాలకు ఏమాత్రం సరిపోవట్లేదా.? ఏదైనా వ్యాపారం చేసే ఆలోచన ఉందా.? సాధారణంగా ఏ వ్యాపారమైన మొదలుపెట్టే ముందు.. అందులో రిస్క్ ఎంత ఉంటుంది.? పెట్టుబడి పెడితే.. వచ్చే లాభం ఎంత.?

Business Ideas: రూ. 50 వేలతో నెలకు రూ. లక్షల్లో సంపాదించొచ్చు.. రిస్క్‌ లేని వ్యాపారాలు
Money
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 05, 2024 | 7:02 PM

చేస్తోన్న ఉద్యోగంతో విసిగిపోయారా.? చాలీచాలనంత జీతం మీ నిత్యావసరాలకు ఏమాత్రం సరిపోవట్లేదా.? ఏదైనా వ్యాపారం చేసే ఆలోచన ఉందా.? సాధారణంగా ఏ వ్యాపారమైన మొదలుపెట్టే ముందు.. అందులో రిస్క్ ఎంత ఉంటుంది.? పెట్టుబడి పెడితే.. వచ్చే లాభం ఎంత.? ఇలా ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. మరి ఈ తరుణంలో మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాస్ తీసుకొచ్చేశాం. పెద్ద రిస్క్ లేకుండా.. కేవలం రూ. 50 వేల పెట్టుబడితో ఈ వ్యాపారాలు మొదలుపెట్టొచ్చు. దీంతో నెలనెలా రూ. లక్షల్లో ఆదాయం మీ సొంతమవుతుంది.

వస్త్రాల వ్యాపారం:

పెళ్లిళ్లు, పండుగలు, పుట్టినరోజు.. ఇలా ఒకటేమిటి మనకు స్పెషల్ డే ఏదైనా కూడా కొత్త బట్టలు వేసుకోకుండా ఆ రోజు గడవదు. దేశంలో ఏ ప్రాంతమైనా.. బట్టలకు డిమాండ్ విపరీతంగానే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ వ్యాపారాన్ని కేవలం రూ. 50 వేల పెట్టుబడితో ప్రారంభించి.. మాంచి లాభాలు ఆర్జించవచ్చు.

స్ట్రీట్ ఫుడ్ స్టాల్ లేదా ఫుడ్ ట్రక్:

ఫుడ్ బిజినెస్.. దేశంలో ఎలాంటి రిస్క్ లేకుండా బెస్ట్ బిజినెస్ ఆప్షన్ ఇది అని చెప్పొచ్చు. మీరు కూడా రూ. 50 వేల పెట్టుబడితో ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెడితే.. వెంటనే ఫుడ్ స్టాల్ లేదా ఫుడ్ ట్రక్‌ని ప్రారంభించండి. దీనికి ముడిసరుకుతోనే పని ఉంటుంది. కాబట్టి వాటికీ అయ్యేది తక్కువ ఖర్చే. ఇక క్వాలిటీ, క్వాంటిటీ మాంచిగా ఉంటే.. మీ ఫుడ్ బిజినెస్ అద్భుతమే. నూడుల్స్, మోమోస్, చాట్-పకోడీ లేదా ఇతర స్ట్రీట్ ఫుడ్ వంటి వాటిని మీరు అమ్మవచ్చు. ఫుడ్ ట్రక్కులలో కూడా మీరు స్ట్రీట్ ఫుడ్స్, టిఫిన్స్ లాంటివి ఉదయం, సాయంత్రం సమయాల్లో అమ్మకం పెట్టుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ట్యూషన్ లేదా ఆన్‌లైన్ క్లాసులు:

మీరు చదివిన, అలాగే మీ జ్ఞానాన్ని మరికొంతమందికి పంచితే.. తప్పేమి కాదు. ఇప్పుడు టీచర్స్‌గా చేస్తున్న ప్రతీ ఒక్కరు.. సాయత్రం వేళల్లో పిల్లలకు ట్యూషన్లు చెబుతున్నారు. మరి మీరు కూడా ఏ సబ్జెక్ట్‌లో పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే.. మీ ఇంటి దగ్గరే స్థానికంగా టెన్త్ అంతకన్నా తక్కువ తరగతులు చదువుతున్న పిల్లలకు.. అలాగే ఇంటర్ చదివేవాళ్లకు ట్యూషన్ చెప్పొచ్చు. లేదా యూట్యూబ్ ద్వారా సొంతంగా చానెల్ ఏర్పాటు చేసుకుని ఆన్‌లైన్ క్లాసులు కూడా బోధించవచ్చు.

వెడ్డింగ్ ప్లానర్:

అతి తక్కువ పెట్టుబడితో ఇదొక విజయవంతమైన వ్యాపారం. మీరు మీ కస్టమర్‌ అవసరాలకు అనుగుణంగా అత్యంత సృజనాత్మకంగా వివాహాలు, ఈవెంట్‌లను నిర్వహిస్తే.. ఈ వ్యాపారంలో మాంచి లాభాలు ఆర్జించినట్టే. దీన్ని ప్రారంభించడానికి కొంత డబ్బు అవసరం పడుతుంది. కానీ ఆ తర్వాత వ్యాపారం లాభాల బాట పడితే.. రాబడి చాలా బాగుంటుంది. వెడ్డింగ్ ప్లానింగ్ లేదా ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో అనేక డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఉదాహరణకు క్యాటరింగ్, ఫోటోగ్రఫీ, డెకరేషన్ ఇలా ఏదొక దానిపై మీరు డబ్బు సంపాదించవచ్చు.

ఊరగాయ వ్యాపారం

తక్కువ పెట్టుబడితో మరో మంచి వ్యాపార ఆలోచన ఊరగాయ వ్యాపారం. భోజనం సమయంలో ఊరగాయ లేకుండా చాలామందికి ముద్దదిగదు. దాదాపు ప్రతి ఇంట్లో కనీసం ఒక రకమైన ఊరగాయ ఉంటుంది. అందువల్ల, మీరు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఊరగాయ వ్యాపారం రిస్క్ లేని బిజినెస్. భారతీయ మార్కెట్లలో ఏడాది పొడవునా పచ్చళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా చాలా సులభంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ఇది చదవండి: తిరుగుండదు ఈ బిజినెస్‌కి.. ప్రతీ నెలా రూ. 50 వేలు పక్కా.. అదేంటంటే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!