AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ 4 పనులు చేయడంలో సిగ్గుపడితే ఎప్పటికీ గెలవలేరు.. ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడంటే.?

ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు.. ఇప్పటికీ మనిషి తన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు పాటిస్తుంటాడు. మానవ జీవితాన్ని ప్రభావితం చేసే ఎన్నో విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించాడు చాణక్యుడు. ఆయన సిద్దాంతాలను ఇప్పటికీ..

Chanakya Niti: ఈ 4 పనులు చేయడంలో సిగ్గుపడితే ఎప్పటికీ గెలవలేరు.. ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడంటే.?
Chanakya Niti
Ravi Kiran
|

Updated on: Jul 04, 2024 | 7:52 PM

Share

ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు.. ఇప్పటికీ మనిషి తన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు పాటిస్తుంటాడు. మానవ జీవితాన్ని ప్రభావితం చేసే ఎన్నో విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించాడు చాణక్యుడు. ఆయన సిద్దాంతాలను ఇప్పటికీ మన జీవితంలో పాటిస్తే.. సులభంగా అన్నింటిలోనూ విజయం సాధించవచ్చు. ఇక చాణక్య నీతి ప్రకారం.. మనిషి తన జీవితంలో ఈ 4 పనులు చేయడానికి సిగ్గుపడితే.. ఎప్పటికీ విజయం సాధించలేడట. మరి అవేంటో చూసేద్దామా..

తినడానికి సిగ్గుపడొద్దు..

చాణక్యుడి ప్రకారం.. ఎప్పుడూ కూడా తినడానికి సిగ్గుపడకూడదు. తినడానికి సిగ్గుపడే ఎవరైనా కూడా ఆకలితో అలమటిస్తారు. అందుకే తినడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. పరిస్థితి ఏదైనా కూడా ఆహారానికి దూరంగా ఉండకూడదు. మీరు ఎవరి ఇంటికైనా అతిధిగా వెళ్తే.. సిగ్గుపడకుండా కడుపు నిండా తినండి.

డబ్బు విషయంలో..

మీరు పురుషుడైనా, స్త్రీ అయినా.. ఎప్పుడూ డబ్బుకు సంబంధించిన విషయాల్లో సిగ్గుపడొద్దు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎంతోమంది ఇతరులకు డబ్బులు అప్పుగా ఇచ్చి.. తిరిగి అడగడంలో భయపడుతుంటారు. ఇతరులు మీ ఈ అలవాటును ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా మీకు ధననష్టం జరుగుతుంది. అందుకే డబ్బు విషయంలో ఎప్పుడూ సిగ్గుపడకూడదు.

ఇవి కూడా చదవండి

జ్ఞానాన్ని పెంచుకోవడంలో..

ఓ వ్యక్తి తన జ్ఞానాన్ని పెంచుకోవడంలో, సంపాదించుకోవడంలో అస్సలు సిగ్గుపడకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. టీచర్‌ని ప్రశ్నలు అడిగి.. సమాధానాలు తెలుసుకునేవారు మంచి విద్యార్ధులుగా ఉంటారు. గురువు నుంచి నేర్చుకోవడంలో సిగ్గుపడే విద్యార్ధులు జీవితాంతం అజ్ఞానంలోనే ఉంటారని ఆచార్య చాణక్యుడు అంటున్నాడు.

పని విషయంలో..

ఒక పనిని మొదలుపెట్టినప్పుడు.. దాన్ని మధ్యలో ఆపకూడదు. అపజయం భయంతో వెనకడుగు వేస్తే.. విజయం వారిని ఎప్పుడూ వరించదు. ఒక వ్యక్తి అపజయం గురించి ఆలోచించకుండా, భయపడకుండా.. పూర్తి చేస్తే విజయం తమదే అవుతుంది. అందుకే పని విషయంలో ఎప్పుడూ సిగ్గుపడకూడదు.

ఇది చదవండి: సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..