Money Astrology: ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్ష యోగం.. తప్పనిసరిగా సంపద వృద్ధి..!
ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బుధ, శుక్ర గ్రహాలు కర్కాటక రాశిలో కలిసి ఉండబోతున్నాయి. ఈ రెండు శుభ గ్రహాలు ఎప్పుడు ఎక్కడ కలిసి ఉన్నా తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష యోగాన్నిస్తాయి. ధన ధాన్య వృద్ధితో పాటు కుటుంబపరమైన సుఖ సంతోషాలు, దాంపత్య జీవితంలో అన్యోన్యత కూడా ఈ రెండు గ్రహాల యుతి వల్ల అనుభవానికి వస్తాయి.
ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బుధ, శుక్ర గ్రహాలు కర్కాటక రాశిలో కలిసి ఉండబోతున్నాయి. ఈ రెండు శుభ గ్రహాలు ఎప్పుడు ఎక్కడ కలిసి ఉన్నా తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష యోగాన్నిస్తాయి. ధన ధాన్య వృద్ధితో పాటు కుటుంబపరమైన సుఖ సంతోషాలు, దాంపత్య జీవితంలో అన్యోన్యత కూడా ఈ రెండు గ్రహాల యుతి వల్ల అనుభవానికి వస్తాయి. భోగభాగ్యాలు పెరిగే అవకాశం ఉన్నందువల్ల విలాస జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది. ప్రస్తుతం 11 రోజుల పాటు ఈ అరుదైన యోగం మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి పట్టే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల ధనాదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో సంపద పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది శ్రమతో అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అనూహ్యంగా గృహ, వాహన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి ధన స్థానంలో బుధ, శుక్ర గ్రహాలు కలవడం వల్ల కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం వల్ల మనశ్శాంతి ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. నిరుద్యోగులకు అనూహ్యమైన ఆఫర్ అందుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. భారీ జీతభత్యాలతో కూడిన స్థిరత్వం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- కర్కాటకం: ఈ రాశిలో బుధ, శుక్ర సంచారం ప్రారంభం అవుతున్నందువల్ల వీరికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి పనీ లాభదాయకమవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార, ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధి స్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, శుక్రుల సంచారం జరగబోతున్నందువల్ల ప్రతి పనీ కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి కోలుకోవడం జరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఒకటి రెండు అతి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి కలిసి వస్తుంది.
- తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల యుతి వల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలు, దూర ప్రాంతాలు వెళ్లవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల సమాజంలో ఒక ప్రముఖుడుగా చెలామణీ అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు.