Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 5, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. మిథున రాశి వారు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జూలై 5, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. మిథున రాశి వారు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో బాధ్యతలు పెంచుతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ప్రేమ జీవితం హ్యాపీగా సాగి పోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబం మీద మీద ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థికంగా కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. ప్రభుత్వో ద్యోగులకు రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధు మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం కూడా సంభవిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాల నిస్తాయి. కొందరు చిన్ననాటి మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవ హారాలు, పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాతో పాటు జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు, సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల కారణంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. తోబుట్టు వుల నుంచి సహకారం లభిస్తుంది. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఒకరి ద్దరు బంధువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలు లాభి స్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశముంది. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అధికారులు, సహోద్యోగుల నుంచి సహ కారం లభిస్తుంది. కుటుంబంలో సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. మానసిక ప్రశాం తతకు లోటుండదు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపా రాల్లో శ్రమాధిక్యత ఉన్నా లాభాలకు కొరత ఉండదు. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. అయితే, అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఇష్టమైన బంధువులకు, మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. పుణ్య క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభ వార్త అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా ఊపందుకుంటాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును జాగ్రత్తపరచుకోవడం మంచిది. ఉచిత సహాయాల మీద వృథా చేయవద్దు. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలక డగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలకు వెడతారు. పిల్లలు పురోగతి సాధి స్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశముంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కొందరు బంధువుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
పుణ్యక్షేత్ర సందర్శనలకు అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఇత రుల మీద ఆధారపడకపోవడం మంచిది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లల చదువులు, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అధికారులు అత్య ధిక ప్రాధాన్యం ఇస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు కొత్త పుంతలు తొక్కుతాయి. లాభాలు అంచనా లను మించుతాయి. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా గడచిపోతుంది. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఓర్పుగా వ్యవహరించి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్క రించుకుంటారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ప్రస్తుతానికి ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపో వడం మంచిది. వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం సంభవిస్తుంది.