Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 4, 2024): మేష రాశి వారి కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిథున రాశికి చెందిన వారికి ఉద్యోగంలో ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జూలై 4, 2024): మేష రాశి వారి కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిథున రాశికి చెందిన వారికి ఉద్యోగంలో ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా సాదా సీదాగా గడిచిపోతుంది. ఉద్యోగంలో ఆదరణతో పాటు పని భారం కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవి తంలో ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆస్తి వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆస్తి వివాదం పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం వంటివి జరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొంటారు. వ్యాపారాల్లో కార్యకలాపాలు ఊపందుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పెండింగ్ పనులు, ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది వ్యయప్రయాసలతో సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం అన్యోన్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనుల్లో శ్రమ, తిప్పట, ఒత్తిడి వంటివి ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో సమస్యలుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పురోగతి చెందుతాయి. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రుల నుంచి సహాయం లభిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచి పోతుంది. బంధువుల రాకపోకలుంటాయి. మిత్రుల వల్ల కొన్ని వ్యవహారాలు చక్కబడతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవు తుంది. చిన్నా చితకా వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సంద ర్శిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. బాధ్యతలు మారిపోవడం జరుగుతుంది. అధికారులు మీ మీద బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడిస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. కొందరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. విహార యాత్రకు బయలుదేరే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి. విశ్రాంతి ఉండకపోవచ్చు. ఉద్యోగంలో కూడా కొద్దిపాటి శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. కుటుంబ పరిస్థితి ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యయ ప్రయాసలతో గానీ వ్యవహారాలు పూర్తి కాకపోవచ్చు. కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. తలపెట్టిన వ్యవహా రాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరగడానికి అవ కాశం ఉంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్ప డుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలు అంచనాల్ని మించుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
అదనపు ఆదాయ మార్గాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వాహన యోగం పడుతుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. వృత్తి జీవితంలో తీరిక లభిం చదు. వ్యాపారాలు లాభసాగిగా సాగుతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగు తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి కష్టనష్టాలుంటాయి. ఉచిత సహాయాలు, దానధర్మాల వల్ల ఇబ్బం దులు పడతారు. కుటుంబ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు ఆశించినంతగా పురో గతి సాధిస్తారు. ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు, ఒత్తిడి తప్పకపోవచ్చు. అధి కారులతో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా ఒత్తిడి పెరిగే సూచనలు న్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.