Zodiac Signs: రాశి మారనున్న 4 గ్రహాలు.. ఆ రాశుల వారి జీవితాల్లో అనుకూల మార్పులు..!
ఈ నెలలో ఏకంగా నాలుగు గ్రహాలు రాశులు మారుతున్నాయి. బుధ, శుక్ర, రవి, కుజులు రాశులు మారుతుండడం వల్ల వివిధ రాశుల వారి జీవితాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నెల మాత్రం ఈ నాలుగు గ్రహాల రాశి మార్పు ఆరు రాశుల వారికి దాదాపు కొత్త జీవితాన్ని ప్రసాదించడం జరుగుతుంది.
ఈ నెలలో ఏకంగా నాలుగు గ్రహాలు రాశులు మారుతున్నాయి. బుధ, శుక్ర, రవి, కుజులు రాశులు మారుతుండడం వల్ల వివిధ రాశుల వారి జీవితాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నెల మాత్రం ఈ నాలుగు గ్రహాల రాశి మార్పు మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి దాదాపు కొత్త జీవితాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో అందలాలు ఎక్కడం, ఆరోగ్యం మెరుగుపడడం, వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పట్టడం, కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి.
- మేషం: రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాలు రాశులు మారడం ఈ రాశివారి జీవితంలో కొన్ని శుభ పరిణామాలకు కారణం అవుతుంది. ఉద్యోగంలో మంచి జీతభత్యాలతో కూడిన స్థిరత్వం లభి స్తుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. మంచి ఉద్యోగంలోకి మారే ప్రయత్నాలు ఫలి స్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. గృహ, వాహన ప్రయత్నాలు విజ యవంతం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- కర్కాటకం: ఈ రాశి మీదుగా శుభ గ్రహాలు సంచారం చేయడంతో పాటు దశమ, లాభ స్థానాలు పటిష్ఠం అవు తున్నందువల్ల ఉద్యోగ జీవితం అనేక విధాలుగా కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగపరంగా స్థిరమైన, ఆశావహమైన జీవితం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. విదేశీయానానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.
- కన్య: ఈ రాశికి నవమ, దశమ స్థానాల్లో గ్రహాల రాశి మార్పు జరుగుతున్నందువల్ల వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో అధికా రులు ఎంతో నమ్మకంతో బరువు బాధ్యతలు పెంచడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఆక స్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
- తుల: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో గ్రహాలు రాశి మారుతున్నందువల్ల ఉద్యోగపరంగా జీతభత్యాలు పెరగడం, అదనపు రాబడికి అవకాశాలు వృద్ధి చెందడం, మంచి పరిచయాలు ఏర్పడడం, లాభ సాటి ఒప్పందాలు కుదరడం వంటివి జరుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రయత్నపూర్వక లాభాలతో పాటు, అప్రయత్న ధనలాభం కూడా ఉంటుంది. పిత్రా ర్జితం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
- మకరం: ఈ రాశికి సప్తమంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉండబోతున్నందువల్ల, వృత్తి, వ్యాపారాల్లో నిమిషం కూడా తీరిక, విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు తగ్గట్టుగానే రాబడి, లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
- మీనం: ఈ రాశికి నాలుగు, అయిదు స్థానాలలో గ్రహాల రాశి మార్పు జరుగుతున్నందువల్ల ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆస్తిపరంగా అనుకూలతలు బాగా పెరుగుతాయి. జీవితంలో ఊహించని పరిణా మాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపో తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది.