పానీపూరి ఫ్యాన్స్.. బీకేర్‌ఫుల్.! గోల్‌గప్పతో క్యాన్సర్ వచ్చే ఛాన్స్.!! విస్తుపోయే విషయాలు

పానీపూరికి ఎంతమంది ఫ్యాన్సో..! గోల్‌గప్పను గుటుక్కున మింగకపోతే కొందరికి రోజు గడవదు. పానీపూరిని గబగబ తినడంలో వచ్చే మజానే వేరు. ఆస్వాదిస్తూనే తెలుస్తుంది ఆ టేస్ట్. కొంచెం కొంచెం కొరుక్కుని తినేది కాదిది. పెదాలు విప్పకుండా అమాంతం నమిలి మింగేయాల్సిందే. చాట్‌ కాలుతూ ఉంటుంది

పానీపూరి ఫ్యాన్స్.. బీకేర్‌ఫుల్.! గోల్‌గప్పతో క్యాన్సర్ వచ్చే ఛాన్స్.!! విస్తుపోయే విషయాలు
Panipuri
Follow us

|

Updated on: Jul 03, 2024 | 8:52 PM

పానీపూరికి ఎంతమంది ఫ్యాన్సో..! గోల్‌గప్పను గుటుక్కున మింగకపోతే కొందరికి రోజు గడవదు. పానీపూరిని గబగబ తినడంలో వచ్చే మజానే వేరు. ఆస్వాదిస్తూనే తెలుస్తుంది ఆ టేస్ట్. కొంచెం కొంచెం కొరుక్కుని తినేది కాదిది. పెదాలు విప్పకుండా అమాంతం నమిలి మింగేయాల్సిందే. చాట్‌ కాలుతూ ఉంటుంది, పానీ కాస్త ఘాటుగా కారంగా ఉంటుంది, తింటున్నప్పుడు కళ్ల నుంచి నీళ్లు కారుతుంటాయి. కొందరైతే తినలేకపోతున్నట్టు చేతులు ఊపుతుంటారు.. తన టర్న్ వచ్చాక ఆలస్యం చేయకుండా మరో పానీపూరి కోసం చేయి చాస్తూనే ఉంటారు. వేసే వాడు పెద్దగా గ్యాప్‌ ఇవ్వడు. పేపర్‌ప్లేట్‌ పట్టుకుని నిలబడ్డాక.. అందులో సన్నగా తురిమిన ఉల్లి వేశాక.. మిషన్‌ స్టార్ట్‌ అవుతుంది. తీరిగ్గా తిందామంటే అస్సలు కుదరదు. నోట్లోంచి కడుపులోకి దిగే సరికి మరో పానీపూరి ప్లేట్‌లోకి వచ్చి పడుతూనే ఉంటుంది.. గొంతులోకి దిగుతూనే ఉంటుంది. కారమైనా, కాలుతున్నా, కళ్లెమ్మటి నీళ్లు కారుతున్నా.. అలా గుటుక్కున తినడంలోనే మజా. అందుకే, పానీపూరీకి అంత ఫ్యాన్స్.

ఎంతోమందికి ఇష్టమైన ఈ పానీపూరి.. ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతోంది. ఒక్కసారి.. ఆ పానీపూరి బండి దగ్గరకెళ్లి చూడిండి. క్లీన్‌గా ఉండనే ఉండదు ఆ ప్లేస్. ఇక ఆ పానీ గురించి చెప్పక్కర్లేదు. రోడ్ల మీద దుమ్ముధూళి అంతా ఆ పానీలోనే పడుతుంటుంది. రోజులో ఎన్ని వేల సార్లు ఆ చేతులను బిందెలో ముంచి తీస్తుంటాడో. చెమటొచ్చినా అదే చేయి, వాష్‌ రూమ్‌కి వెళ్లొచ్చినా అదే చేయి. మధ్యమధ్యలో పానీపూరి బండిని శుభ్రం చేసేది కూడా అదే చేయి. ఇక ఆ పానీ తయారీకి ఏ నీళ్లు వాడతాడో ఎవరు చూసొచ్చారు. కచ్చితంగా మినరల్‌ వాటర్‌ అయితే కాదు. ఇ-కొలి, క్లెబ్సిఎల్లా, సూడొమొనాస్, కాండిడస్, ఎంటిరొకొకై.. ఇలాంటి బ్యాక్టీరియాలు ఆ పానీపూరీలో ఈత కొడుతూ జలకాలాడుతుంటే.. మైక్రోస్కోప్‌ ద్వారా స్వయంగా చూసి ఓ రిపోర్ట్‌ ఇచ్చారు ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్‌ వాళ్లు. అయినా సరే.. ఆ బ్యాక్టీరియాతో నిండిన పానీనే, చేతిని వేల సార్లు ముంచి తీస్తున్న ఆ పానీనే.. మరికాస్త పోయించుకుని మరీ తాగుతారు.

చాలామంది ఓ కామన్‌ క్వశ్చన్ వేస్తుంటారు. పానీపూరి అందరూ తింటున్నారు.. వాళ్లకేం కావడం లేదు కదా అని. తిన్న వెంటనే రిజల్ట్‌ ఇవ్వాలనే రూల్‌ ఏం లేదు. తరువాత రోజో, రెండు రోజులకో ఎఫెక్ట్‌ చూపిస్తుంది. కాకపోతే అది పానీపూరి తినడం వల్లే అని అనుకోరు చాలామంది. అలా ఒప్పుకోడానికి కూడా మనసు అంగీకరించదు. పానీపూరీ వల్లే నాకిలా జరిగిందని అనుకుంటే.. దాన్ని దూరం చేసుకోవాల్సి వస్తుందన్న బాధ, ఆవేదన. అందుకే, వాళ్లకు వాళ్లే మనసుకి అబద్ధం చెప్పుకుని మరీ మరోసారి పానీపూరి తినడానికి చాట్‌బండివైపు అడుగులు వేస్తుంటారు. ఎంతైనా ఫేవరెట్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ కదా. మాట పడనివ్వరు దానిమీద. అయితే.. పానీపూరి లవర్స్‌కు షాక్‌ కొట్టే రిపోర్ట్ ఒకటి బయటికొచ్చింది. వాటిలో క్యాన్సర్‌కు దారితీసే దారుణమైన పదార్థాలు, ఫుడ్‌ కలర్స్‌ వాడుతున్నారని తేలింది. అందుకే, కర్నాటకలో పానీపూరిని బ్యాన్‌ చేసే దిశగా ఆలోచిస్తున్నారు. చెన్నైలోనూ కొన్ని శాంపిల్స్‌ తీశారు. అక్కడ వచ్చే రిపోర్ట్ ఆధారంగా తమిళనాడు గవర్నమెంట్‌ కూడా పానీపూరిపై బ్యాన్‌ విధించేందుకు రెడీ అవుతోంది.

కర్నాటకలో ఫుడ్‌ సేఫీ ఆఫీసర్లు కొన్నిచోట్ల శాంపిల్స్‌ తీశారు. 276 పానీపూరీ బండ్ల నుంచి శాంపిల్స్‌ తీస్తే అందులో 41 శాంపిల్స్‌లో ఆర్టిఫిషియల్ కలర్స్, క్యాన్సర్‌కు దారి తీసే కారకాలు ఉన్నాయని తేల్చారు. మరో 18 పానిపూరి శాంపుల్స్‌లో అయితే మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరాని కలర్స్‌, ఇతరత్రా చెత్త ఉన్నాయని కనుగొన్నారు. సన్‌షైన్‌ పసుపు, బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్‌ వంటి ఫుడ్‌ కెమికల్స్‌ పానీపూరి తయారీలో వాడుతున్నారు. బ్లూ FCF అనే కలర్‌ ఏంటో తెలుసా. ఇదొక పెట్రోలియం ప్రాడక్ట్‌ నుంచి తీసిన సింథటిక్‌ కలర్‌ డై. హెల్త్‌ విషయంలో సెన్సిటివ్‌గా ఉండేవాళ్లు పొరపాటున దీన్ని తింటే.. అలర్జీలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు, గుండెకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ జబ్బులు, దీంతో పాటు రోగ నిరోధక శక్తి-ఇమ్యూనిటీ పవర్‌ తగ్గడం జరుగుతుంది. పానీపూరితో పాటు సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లు ఇస్తుంటారు. వీటిలోనూ క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు తేలింది. చాలా వరకు శాంపిల్స్‌లలో సన్సెట్ ఎల్లో, బ్రిలియంట్ బ్లూ, కార్బోసిస్ రంగులు కనిపించాయి. కృత్రిమ రంగులతో తయారుచేసిన సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లను నిషేధించే ఆలోచనలో ఉన్నారు కర్నాటక అధికారులు. సో, ఎంతో ఇష్టంగా తినే పానీపూరీ ఫుడ్‌ కలర్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే కెమికల్స్‌ ఉన్నట్లు తేలింది.

అప్పుడప్పుడు తిన్నా సరే.. కొన్నిసార్లు పానీపూరితో ఇబ్బందులు పడక తప్పదు. ఈ స్ట్రీట్ ఫుడ్ వల్ల స్టమక్ క్యాన్సర్ తప్పదంటున్నారు న్యూట్రీషియనిస్ట్స్‌. పానీపూరీలోని పూరీ తయారీకి రీయూజ్డ్ నూనె వాడుతుంటారు. పైగా మైదా ఉపయోగిస్తారు. అక్కడి నుంచే అసలు సమస్య మొదలు అవుతుందంటున్నారు వైద్య నిపుణులు. ఈరోజుల్లో ప్రతి ఆహార పదార్ధంలో ఆర్టిఫిషియల్ కలర్స్‌ కలుపుతున్నారు. మనిషి ఆరోగ్యాన్ని పాడుచేసేవి ఇవే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయినా సరే.. వీటిని కంట్రోల్‌ చేయలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆహారానికి సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తుండడంతో.. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక హోటళ్లపై రైడ్స్ జరిగాయి. ఈ తనిఖీల్లో ఏమాత్రం పరిశుభ్రత లేని ఆహారం తయారు చేస్తుండడం, నాణ్యత లేని పదార్థాలు వాడడం గుర్తించారు. కెమికల్ కలర్స్‌తో హైపర్ యాక్టివిటీ, అరుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, సింథటిక్ కలర్స్‌ వాడిన పదార్ధాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైఫాయిడ్, విరేచనాలు, కలరా.. ఇలాంటివన్నీ అపరిశుభ్రమైన పరిసరాల్లో తయారు చేసే ఆహారం తినడం వల్లే వస్తాయి. సో, పానీపూరి అంటే ఎంత ఇష్టం ఉన్నా.. కాస్త పరిశుభ్రత పాటించే దగ్గర, ఎప్పుడో ఒకసారి తింటే సరి. ఛాన్స్‌ తీసుకోవడం ఎందుకనుకుంటే పూర్తిగా మానేయడమే అత్యుత్తమం. ఎందుకంటే.. క్యాన్సర్‌ ఊరికే రాదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు