Gold Price Today: చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధర.. మంగళవారం ఎంత పెరిగిందంటే
సంక్రాంతి తర్వాత బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ ఒడిదుడుకులు దీనికి కారణం. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 24, 22 క్యారెట్ల బంగారం, కిలో వెండి ధరలు ఆల్-టైమ్ హైలో ఉన్నాయి. గత 20 రోజుల్లో కిలో వెండి ధర భారీగా రూ.73,000 పెరిగింది. తాజా ధరల వివరాలను తెలుసుకోండి.
బంగారం,వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సంక్రాంతి తర్వాత కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తోంది. రోజురోజుకి గోల్డ్ రేట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు సైతం గోల్డ్, సిల్వర్ రేట్లు మరోసారి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టబోతున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం మరోసారి గోల్డ్ రేట్లు చుక్కలు చూపించాయి. జనవరి 20, మంగళవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,47,280 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,35,000 రూపాయలుగా ఉంది.హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,30,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,430 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,35,150 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,35,000 ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,480 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,36,100 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,300 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,35,100 వద్ద కొనసాగుతోంది. కోల్ కతా లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,280 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,35,000 వద్ద కొనసాగుతోంది. వెండి ధర మరో ఆల్ టైమ్ హై రికార్డ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కేజీ వెండి ధర రూ.3,30,000 రూపాయిలుగా ఉంది. గత 20 రోజుల్లో కిలో వెండి ఏకంగా రూ.73,000 పెరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు.. వెదర్ రిపోర్ట్
A.R. Rahman: ‘ఎవరినీ బలవంతం చేసి మతం మార్చరు’
అందగత్తెల రీయూనియన్.. సందడి.. సందడి చేసిన ముద్దుగుమ్మలు
AR Rahman: మాటలు కాదు.. ముందు మ్యూజిక్ మీద దృష్టి పెట్టు
తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

