AR Rahman: మాటలు కాదు.. ముందు మ్యూజిక్ మీద దృష్టి పెట్టు
ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌పై చేసిన 'పవర్ షిఫ్ట్', 'మత వివక్ష' వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. షాన్, కంగన వంటి వారు దీనిని ఖండించారు, ప్రతిభకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రెహమాన్, తన మాటలతో ఎవరినీ బాధపెట్టే ఉద్దేశ్యం లేదని, తాను గర్వపడే భారతీయుడిని అని వివరణ ఇచ్చారు. ఈ వివాదం బాలీవుడ్ అంతర్గత సమస్యలను వెలుగులోకి తెచ్చింది.
పాడ్‌కాస్ట్‌లో రెహమాన్ హిందీ చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.కొంతకాలంగా తాను బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాని, పరిశ్రమలో “పవర్ షిఫ్ట్” జరిగిందని అన్నారు. సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లో అధికారం కేంద్రీకృతమైందని,ఈ మార్పుకు మత వివక్ష కూడా కారణం కావచ్చని అన్నారు. అది బహిరంగంగా గాక.. గుసగుసల రూపంలో తన వరకు వస్తోందని చెప్పడం వివాదం రేగింది. ఏ ఆర్ రెహమాన్ మాటలకు గాయకుడు షాన్, నటి కంగన రనౌత్ కౌంటర్ ఇచ్చారు. అవకాశాలు తగ్గడాన్ని మతంతో ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారని, ఇక్కడ మతం కంటే ప్రతిభకే ప్రాధాన్యం ఉంటుందని షాన్ గుర్తు చేశారు. రెహమాన్ ఇలాంటి వివాదాల జోలికి పోకుండా మంచి సంగీతంపై దృష్టి పెట్టాలని సూచించారు. దాంతో ఏ ఆర్ రెహ్మాన్ తన కామెంట్లపై వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. మాటలతో ఇతరులను బాధపట్టే తత్వం తనది కాదని వీడియోలో అన్నారు. భారతీయునిగా పుట్టడం తన అదృష్టమనీ తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించే అవకాశం తన దేశం తనకిచ్చిందనీ తన నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు రెహ్మాన్. దేశంలో తొలి మల్టీకల్చరల్ బ్యాండ్‌ను సృష్టించడం నుంచి.. హాన్స్‌జిమ్మర్‌తో కలిసి ‘రామాయణ’ సినిమాకు సంగీతం అందించడం వరకూ తన ప్రతి ప్రయాణం కొనసాగిందని తెలిపారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది సినిమాలో రెహమాన్ మ్యూజిక్ అందించిన ‘చికిరి చికిరి’ పాట ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు
Sreeleela: శ్రీలీల భారీ ప్లానింగ్.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా
కటౌట్‌తో పనేంటి ?? కంటెంట్ ఉంటే చాలు.. హిట్టు పక్కా
Mahesh Babu: వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్ నెక్స్ట్ సినిమా
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

