వంద కోట్ల క్లబ్ లో.. సత్తా చాటుతున్న సీనియర్ హీరోలు
తెలుగు సీనియర్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లు 100 కోట్ల క్లబ్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. చిరు బ్లాక్‌బస్టర్ హిట్‌తో 200 కోట్ల క్లబ్‌లోకి, బాలయ్య ఐదు సినిమాలతో 100 కోట్ల క్లబ్‌లో అగ్రస్థానంలో నిలిచారు. వెంకటేష్ సైతం హ్యాట్రిక్ సాధించగా, నాగార్జున సోలో 100 కోట్ల లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మార్కెట్ లెక్కలు మారుతున్నా, సీనియర్ స్టార్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
యంగ్ హీరోల మధ్యే కాదు సీనియర్ హీరోల మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తోంది. కథల ఎంపిక, కలెక్షన్ రికార్డుల విషయంలో సీనియర్ స్టార్స్ మధ్య గట్టి పోటి కనిపిస్తోంది. మార్కెట్ లెక్కలు మారిపోవటంతో టాలీవుడ్ సీనియర్స్, కొత్త హైట్స్ రీచ్ అయ్యేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. సంక్రాంతి బరిలో మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు, ఆ సినిమాతో మరో రేర్ రికార్డ్ సెట్ చేశారు. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్‌లోనే 200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మన శంకరవరప్రసాద్‌గారు చిరు కెరీర్‌లో వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన నాలుగో సినిమాగా నిలిచింది. మరో సీనియర్ స్టార్ బాలకృష్ణ కూడా ఇదే రేంజ్‌లో జోరు చూపిస్తున్నారు. వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో బాలయ్య, అఖండ 2తో నిరాశపరిచినా… ఆ సినిమాను కూడా వంద కోట్ల మార్క్ దాటించటంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఈ క్లబ్‌లో ఐదు సినిమాలతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు బాలకృష్ణ. విక్టరీ స్టార్ వెంకటేష్ కూడా వంద కోట్ల క్లబ్‌లో ప్లేస్ సంపాదించారు. ఎఫ్ 2, సంక్రాంతి వస్తున్నాం సినిమాలతో హండ్రెడ్ క్రోర్ మార్క్‌ను క్రాస్ చేసిన వెంకీ, మన శంకర వరప్రసాద్‌గారు మూవీలో చేసిన గెస్ట్ రోల్‌తో హ్యాట్రిక్ కొట్టారు. ఈ విషయంలో కింగ్ నాగార్జున మాత్రం కాస్త వెనకబడ్డారు. కుబేర, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలతో టాప్ గ్రాసర్స్ లిస్ట్‌లో ప్లేస్ దక్కించుకున్నా… సోలోగా వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు. అందుకే అప్ కమింగ్ సినిమాలతో ఆ కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారు నాగ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్ లో కొత్త ట్రెండ్.. యాక్షన్ రూట్ లో సీనియర్ బ్యూటీస్
2027 సమ్మర్ క్లాష్.. ఇప్పటి నుండే రచ్చ రచ్చ
కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే కలెక్షన్ల వర్షం.. లేకుంటే
Ram Charan: నా కెరీర్ లోనే ఇది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.. అంటున్న చెర్రీ
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

