AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే కలెక్షన్ల వర్షం.. లేకుంటే

కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే కలెక్షన్ల వర్షం.. లేకుంటే

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jan 20, 2026 | 4:07 PM

Share

సంక్రాంతికి చిన్న, పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావటంపై నెలకొన్న చర్చలకు ఈ పండుగ చిత్రాలు తెరదించాయి. కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని బాక్సాఫీస్ వద్ద నిరూపితమైంది. థియేటర్ల సమస్య, సమీక్షల ప్రభావం వంటి ఆందోళనలను పటాపంచలు చేస్తూ, అన్ని సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. టాలీవుడ్ కు కొత్త జోష్ అందించిన సంక్రాంతి విజయాలు, కంటెంట్ కు పట్టం కట్టాయి.

టాలీవుడ్‌లో సంక్రాంతికి ముందు చాలా పెద్ద చర్చే జరిగింది. ఒకేసారి ఐదు సినిమాలు బరిలో దిగటం, అందులో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు క్లాష్‌ అవ్వటంతో చాలా రకాల డిస్కషన్స్ తెర మీదకు వచ్చాయి. మరి ఆఫ్టర్‌ రిలీజ్‌ సంక్రాంతి సినిమాలు ఆ డిస్కషన్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాయా? అసలు పొంగల్ మూవీస్‌ ఏం ప్రూవ్‌ చేశాయి.? పండగొచ్చిందంటే చాలు టాలీవుడ్‌లో సినిమాల సందడితో పాటు వివాదాలు కూడా క్యూ కడతాయి. ముఖ్యంగా ఒకేసారి నాలుగైదు సినిమాలు రిలీజ్ కావటం మీద పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఆడియన్స్ థియేటర్లకు వస్తారా..? చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వటం లేదు. రివ్యూలు, సోషల్ మీడియా సినిమాలను చంపేస్తున్నాయి. మా సినిమాను కావాలనే తొక్కేస్తున్నారు. ఇలా ఎన్నో చర్చలు బాక్సాఫీస్‌ దగ్గర హీట్ పెంచేస్తాయి. కానీ ఈ సంక్రాంతికి అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఈ సంక్రాంతికి చిన్న పెద్ద అన్ని రేంజ్‌ల సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కంటెంట్ బాగున్న సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ఓకే అనిపించుకున్న సినిమాలు కూడా పండుగ అడ్వాంటేజ్‌తో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఒకే జానర్‌ అయినా… అన్నీ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. దీంతో పొంగల్ బరిలో పోటీ ఎంత ఉన్నా.. కంటెంట్ బాగున్న సినిమాలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని ప్రూవ్ అయ్యింది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే మన శంకరవరప్రసాద్‌ గారు 200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేశారు. మెగాస్టార్‌ మూవీకి పాజిటివ్ టాక్‌ వస్తే ఆ రేంజ్‌ ఎలా ఉంటుందో ఈ సినిమా ప్రూవ్ చేసింది. అయితే చిరు ఇంతలా జోరు చూపిస్తున్నా.. ఆ తరువాత వచ్చిన సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. రవితేజ భర్త మహాషయులకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, శర్వానంద్‌ నారీ నారీ నడుమ మురారి సినిమాలు వసూళ్ల విషయంలో తగ్గేదే లే అంటున్నాయి. చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురవుతుందన్న విషయంలోనూ సంక్రాంతి సినిమాలు క్లారిటీ ఇచ్చేశాయి. చిన్న సినిమాగానే ఆడియన్స్‌ ముందుకు వచ్చిన అనగనగా ఒకరాజు నార్మల్ టికెట్‌ రేట్స్‌తోనే మూడు రోజుల్లో 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించటం, థియేటర్లు లేకుండా సాధ్యమేనా..? వరుస ఫ్లాపుల తరువాత శర్వా చేసిన నారీ నారీ నడుమ మురారీ ఈ రేంజ్‌ వసూళ్లు సాధించటం, పెద్ద సినిమాలు తొక్కేస్తే సాధ్యపడుతుందా..? ఇన్ని థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తాయా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సంక్రాంతి సినిమాలు. తెలుగు ఇండస్ట్రీకి కొత్త జోష్‌ తీసుకువచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: నా కెరీర్ లోనే ఇది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.. అంటున్న చెర్రీ

హిట్టు కోసం పక్క చూపులు చూస్తున్న తమిళ దర్శకులు..

3 మేడలు, కారు, వడ్డీ వ్యాపారం.. ఈ బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

టాయిలెట్‌లో పేపర్‌‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

SBI New Rules: రూల్స్‌ మార్చిన ఎస్‌బీఐ.. మళ్లీ చార్జీల మోత