టాయిలెట్‌లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇండిగో విమానం 6E-6650 ఢిల్లీ నుండి బాగ్డోగ్రాకు వెళ్తుండగా టాయిలెట్‌లో బాంబు బెదిరింపు నోట్ లభించడంతో లక్నోకు మళ్లించారు. 238 మందితో కూడిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. బాంబు డిస్పోజల్ బృందాలు తనిఖీ చేయగా ఎలాంటి బాంబు లభించలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇండిగో దర్యాప్తుకు సహకరిస్తోంది.
ఇండిగో విమానం 6E-6650 ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బాగ్డోగ్రాకు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా, టాయిలెట్‌లోని ఒక టిష్యూ పేపర్‌పై బాంబు ఉన్నట్లు చేతితో రాసిన బెదిరింపు నోట్‌ను సిబ్బంది గుర్తించారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ని అప్రమత్తం చేశారు. అధికారుల సూచన మేరకు విమానాన్ని సమీపంలోని లక్నో విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 238 మంది ఉన్నారు. ఉదయం 9:17 గంటలకు విమానం లక్నోలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం విమానాన్ని వెంటనే ఐసోలేషన్ బేకు తరలించి ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. సమాచారం అందుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్ బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసాయి. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించింది. ప్రయాణికుల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపింది. ప్రయాణికులకు తాత్కాలికంగా అసౌకర్యం కలగకుండా ఆహారం, ఇతర ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ప్రతినిధి వివరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
SBI New Rules: రూల్స్ మార్చిన ఎస్‌బీఐ.. మళ్లీ చార్జీల మోత
Pomegranate Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. ఇంక అంతే సంగతులు
పారాసిటమాల్ వాడకంపై ఆందోళన వద్దు.. అధ్యయనం ఏం చెప్పిందంటే
పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీల ధరలు!
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
టాయిలెట్‌లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే

