మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
బిహార్‌లో పండగ వేళ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఏడో తరగతి బాలుడు రితేష్ ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతుండగా, స్థానికులు మాత్రం మానవత్వం మరిచిపోయి ట్రక్కు నుండి జారిపడిన చేపల కోసం ఎగబడ్డారు. సంచుల్లో నింపుకుని వెళ్ళారు. సీతామర్హి జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పండగ వేళ బిహార్‌లో అమానవీయ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన చూసి కూడా మానవత్వం మరిచి ప్రవర్తించారు స్థానికులు. ప్రమాదానికి గురైన ట్రక్కులో నుంచి జారిపడిన చేపల కోసం ఎగబడ్డారు. ఈ ఘటన బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో జరిగింది. పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాఝీహట్ గ్రామానికి చెందిన రితేష్ కుమార్ అనే బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఉదయాన్నే ట్యూషన్‌కని సైకిలు మీద వెళ్తున్నాడు. ఇంతలో చేపల లోడుతో వెళ్తున్న ట్రక్కు వేగంగా దూసుకు వచ్చి బాలుడిని ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సమీపంలో ఉన్నవారు షాకయ్యారు. కేకలు వేశారు. కొద్దిసేపటికే బాలుడి రితేష్ తండ్రి సంతోష్ దాస్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా మారిన బిడ్డను చూసి తీవ్ర దుఃఖంతో కుమిలిపోయారు. ఇవేవీ పట్టించుకోని స్థానికులు ట్రక్కులో నుంచి జారిపడిన చేపల కోసం ఎగబడ్డారు. చేపలను సంచుల్లోకి నింపుకొని వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ప్రజలను అక్కడి నుంచి చెదరగొట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా.. అసలు నిజాలు తెలిస్తే షాకవుతారు
ఎండు చేపలను ఇష్టంగా తింటున్నారా.. డేంజర్ సుమా
Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే
జుట్టు రాలిపోతోందా.. ఈ డ్రింక్ ట్రై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్

