AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే

Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే

Phani CH
|

Updated on: Jan 19, 2026 | 8:39 PM

Share

దీపికా పడుకోన్ తన 40వ ఏట కూడా మెరిసే చర్మం, అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఎలా ఉంటుందో తెలుసా? ఆమె సమతుల్య ఆహారం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఫ్యాడ్ డైట్లకు దూరంగా ఉండి, అన్ని ఆహారాలను మితంగా తీసుకుంటుంది. 'విపరీత కరణి' యోగాతో శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ, నిత్యం స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె ఆరోగ్య రహస్యాలు మీరూ పాటించవచ్చు.

మెరిసే చర్మం మంచి ఫిట్‌నెస్ చూసి దీపిక వయసును అంచనా వేయడం కష్టమే. వ్యాయామం ఆహారపు అలవాట్లే దీపికను టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలబెడుతోంది. ఫిబ్రవరి 5న దీపికకు 40 ఏళ్లు వస్తాయి. చాలా మంది సెలబ్రిటీలు తక్షణ ఫలితాల కోసం ‘ఫ్యాడ్ డైట్స్’ పాటిస్తుంటారు. కానీ దీపికా వేరే రకంగా ఆహారం నియంత్రణ చేస్తారు. గతంలో తన ఇన్‌స్టా పోస్టులో చెప్పినట్లుగా తను ఎప్పటినుంచో సమతుల్య ఆహారాన్ని తీసుకుంటున్నారు. ప్రాక్టికల్‌ గా, ఈజీగా పాటించే ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యత ఇస్తారట. చాలా మంది సెలబ్రిటీలు సలాడ్ల మీదే బతుకుతారన్నది అపోహ మాత్రమే. అన్ని ఆహార పదార్థాలను మితంగా తినడం, జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం తన ఫిలాసఫీ అంటారు దీపిక. హెల్దీగా వారం అంతా తింటూ, అప్పుడప్పుడు ఇష్టమైన స్వీట్స్‌ను ఆస్వాదించడం మానసిక ప్రశాంతతను ఇస్తుందని దీపిక నమ్ముతారు. ఫిట్‌నెస్ కోసం జిమ్‌కి వెళ్లడమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని దీపికా అంటారు.సెల్ఫ్ కేర్ అనేది ఏదో ఒక నెల మాత్రమే చేయాల్సింది కాదు, ప్రతి రోజూ మన కోసం మనం కేటాయించుకోవాల్సిన సమయమని అంటారు. ‘విపరీత కరణి’ యోగాసనం శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందని అంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జుట్టు రాలిపోతోందా.. ఈ డ్రింక్‌ ట్రై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం

ఎముకలకు పుష్టినిచ్చే ఆహారాలు ఇవే

ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం.. అమర్‌నాథ్ కు ప్రయాణం ఇక్కడి నుంచే..

సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ

జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే