ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం.. అమర్‌నాథ్ కు ప్రయాణం ఇక్కడి నుంచే..
లడఖ్‌లోని ద్రాస్, ప్రపంచంలోనే రెండవ అత్యంత శీతల ప్రాంతంగా పేరుగాంచింది, ఇక్కడ చలికాలంలో మైనస్ 40°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వేసవిలో హిమాలయ అందాలు, కార్గిల్ యుద్ధ స్మారకం, ట్రెక్కింగ్ వంటి పర్యాటక ఆకర్షణలతో అలరారుతుంది. జూన్-సెప్టెంబర్ మధ్య సందర్శనకు అనుకూలం. విమానం లేదా రైలు మార్గంలో చేరుకోవచ్చు. సాహస ప్రియులకు చలికాలం ప్రత్యేక అనుభూతినిస్తుంది.
ఈసారి చలికాలం చుక్కలు చూపిస్తోంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. మన దేశంలోని ఓ ప్రాంతంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు చేరుకున్నాయంటే నమ్ముతారా? ప్రపంచంలోనే రెండవ అత్యంత శీతల ప్రాంతంగా లద్దాఖ్‌లోని ద్రాస్ కు పేరుంది. శ్రీనగర్ నుంచి కార్గిల్‌కు వెళ్లే దారిలో ద్రాస్ వస్తుంది. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు చేరుకుంటాయి. ప్రాంతం మొత్తం మంచు దుప్పటి కప్పుకున్నట్టు మారిపోతుంది. జొజిలా పాస్ మొదట్లో ద్రాస్ గ్రామం ఉంది. ఎండాకాలంలో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. అమర్‌నాథ్ గుహ, సురు వ్యాలీకి ట్రెక్కింగ్ కూడా ఇక్కడి నుంచే ప్రారంభం కావడంతో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటోంది. కార్గిల్ యుద్ధం స్మారక నిర్మాణాలున్న టైగర్ హిల్‌కు దగ్గర్లో ద్రాస్ ఉంది. ఇక్కడ నుంచి ఎల్‌ఓసీ కనిపిస్తుంది. ద్రాస్‌కు దగ్గరలో ఉన్న బ్రిగేడ్ వార్ గ్యాలరీలో కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విశేషాలను చూడొచ్చు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారి కోసం నిర్మించిన ద్రాస్ యుద్ధ స్మారక స్థూపం ఇక్కడే ఉంది. హిమాలయాల్లో ద్రాస్ ఉన్నప్పటికీ పర్యాటకుల కోసం ఇక్కడ చిన్నపాటి హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో వెళితే హిమాలయ అందాలను, కశ్మీర్ వాసుల ఆతిథ్యాన్ని ఆస్వాదించవచ్చు. జూన్ – సెప్టెంబర్ మధ్య కాలం ద్రాస్ పర్యటనకు అత్యంత అనుకూలం. అటు హిమాలయాలు, ఇటు పచ్చదనం కలగలిసి ద్రాస్ స్వర్గాన్ని తలపిస్తుందని అంటారు. సాహసోపేత పర్యటనలను కోరుకునే వారు చలికాలంలో వెళుతుంటారు. విమానాల్లో వెళ్లే వారు లేహ్ ఎయిర్‌పోర్టులో దిగి ఆపై రోడ్డు మార్గంలో ద్రాస్ చేరుకుంటారు. జమ్మూ తవీ స్టేషన్ వరకూ రైల్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ద్రాస్‌కు చేరుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడుతూ
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

