పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
చైనా మాంజా మనుషులు, పక్షులకు ఉరితాళ్లుగా మారుతోంది. నిర్లక్ష్యంగా వదిలేయబడిన మాంజా ప్రాణాలను బలిగొంటోంది. వరంగల్‌లో ఇటీవల ఒక పావురం చైనా మాంజాకు చిక్కుకొని మృత్యువుతో పోరాడుతుండగా, ఓ కానిస్టేబుల్ రక్షించారు. సంక్రాంతి వంటి పండుగలలో దీని వినియోగం పెరుగుతోంది. నిషేధం ఉన్నా విక్రయాలు ఆగడం లేదు. ప్రజలు, గాలిపటాలు ఎగరేసేవారు చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలి, బాధ్యతగా వ్యవహరించాలి.
చైనా మాంజాలు మనుషులు, పక్షుల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయి. నిర్లక్ష్యంగా వదిలేసిన చైనా మంజాలు పక్షుల ప్రాణాలు మింగేస్తున్నాయి. మనుషుల ప్రాణాలు గాల్లో దీపంలా మార్చేస్తున్నాయి. తాజాగా వరంగల్ బట్టలబజార్ లో జరిగిన ఓ ఘటనలో చైనా మంజా చుట్టుకొని పావురం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలతో నేలపై పడిపోయిన ఆ పావురాన్ని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించి దానికి ప్రాణం పోశాడు. చైనా మంజాల విక్రయాలు, వినియోగంపై ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా వాటి విక్రయాలు ఆగడం లేదు.. గాలిపటాలు ఎగిరేసే వారు మారడం లేదు.. చైనా మంజాను నిర్లక్ష్యంగా వదిలేయడంతో గాలిలో వేలాడుతున్న చైనా మంజాలు పక్షులు, మనుషులు కూడా బలైపోతున్నారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగరేసిన చైనా మంజాలు ఎంతోమందిని విగత జీవులుగా మార్చాయి. కొందరికి గొంతు తెగి ఆస్పత్రి పాలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో పశు పక్ష్యాదులు బలయ్యాయి. తాజాగా వరంగల్ బట్టలబజార్ లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో చైనా మంజా చుట్టుకొని పావురం నేల పై రాలి పడింది. పావురం రెక్కలు మాంజాకు చుట్టుకొని గాయపడిన పావురం నేలమీదపడి.. మృత్యువుతో పోరాడుతోంది. సరిగ్గా ఆ సమయానికి ఆ పావురాన్ని హఫీజ్ పాషా అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించాడు. స్థానికుడు నాగపూరి శ్రీధర్ సహాయంతో ఆ పావురానికి ప్రాణం పోశారు. పతంగులు ఎగరేసేవారు చైనా మాంజాలను ఇలా నిర్లక్ష్యంగా వదిలేసి పశు పక్షాదులు, మనుషుల ప్రాణాలకు ముప్పు తేవద్దని కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెన్నైలో ఎన్టీఆర్ నివాసం.. త్వరలో అభిమానులందరికీ ప్రవేశం
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా !!
యాదాద్రి జిల్లాలో పులి సంచారం.. భయం గుప్పెట్లో జనం
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

