AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాదాద్రి జిల్లాలో పులి సంచారం.. భయం గుప్పెట్లో జనం

యాదాద్రి జిల్లాలో పులి సంచారం.. భయం గుప్పెట్లో జనం

Phani CH
|

Updated on: Jan 19, 2026 | 7:03 PM

Share

యాదాద్రి జిల్లాలో పులి/చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. వ్యవసాయ పొలాల వద్ద ఆవుల మందపై దాడి చేసి దూడను చంపింది, మరొకటి అపహరించింది. గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ అధికారులు పాదముద్రలను గుర్తించి, అది చిరుతపులి అయి ఉండవచ్చని నిర్ధారించారు. రాత్రిపూట బయటకు రావద్దని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హెచ్చరికలు జారీ చేశారు.

యాదాద్రి జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఆవుల మంద పై దాడి చేసి ఆరునెలల లేగ దూడను చంపేసింది. ఇరవై రోజుల లేగ దూడను లాక్కెళ్ళింది. పశువుల మందపై పులి దాడి చేయడంతో గ్రామస్తులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు. సిద్దిపేట జిల్లాలో 20 రోజుల క్రితం పులి సంచారం ట్రాఫ్ కెమెరా లో అటవీ అధికారులు గుర్తించారు. అదే పులి యాదాద్రి జిల్లాలోని రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో సంచరిస్తోంది. తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని ఆవుల మంద వద్దకు ఆదివారం ఉదయం పాలు పిండేందుకు కృష్ణ అనే రైతు వెళ్లాడు. అప్పటికే ఒక లేగ దూడ రక్తపు మడుగులో మృతి చెంది కనిపించగా, అక్కడే కట్టేసిన మరో లేగ దూడ కనిపించకుండా పోయింది. రాజపేట మండలం బేగంపేట లో కూడా చిరుత పులి అడుగులను రైతులు గుర్తించారు. ఈ రెండు ఘటనల్లో పరిసర గ్రామాల రైతులు పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారంతో వీరారెడ్డిపల్లి, గంధమల్ల, ఎన్‌జీ బండల్, కోనాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. రెండు ప్రాంతాల్లో పులి గోర్లతో దాడి చేసిన ఆనవాళ్లు కనిపించాయి. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల సమయంలో పులి దాడి వల్ల దూడ మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రాజాపేట మండలంలోని బేగంపేటలో ఫారెస్ట్ అధికారులు పులి పాద ముద్రలను పరిశీలించారు. ఇవి చిరుతపులి అడుగు జాడలేనని, బురదలో అడుగు జాడలు కొంచెం పెద్ద సైజు ఉండటంతో పెద్దపులిగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తుర్కపల్లి మండలంలోని గంధమల్ల నుంచి వచ్చి ఉండొచ్చని, రాత్రి ఇక్కడే ఉందా లేదా వెళ్లిపోయిందా అన్న కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇళ్లలో నుంచి బయటకు రావద్దని.. పశువుల మంద, వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని ఫారెస్టు అధికారులు హెచ్చరించారు. గుంపులుగా చప్పుడు చేస్తూ వెళ్లాలని గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. వ్యవససాయ బావుల వద్ద ఉన్న పశువులను ఇంటికి తరలించాలని ఫారెస్ట్ సూచించారు. చిరుతపులి జాడలపై వివరాలు సేకరిస్తామని, చిరుత వెళ్లిపోయిన సమాచారం అందించేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: మేకోవర్ తో మాయ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్

సింక్ అయిన దర్శకులతో సీనియర్ల సందడి

Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్

Prabhas: కెప్టెన్లకు డార్లింగ్ ఇస్తున్న టార్గెట్ ఏంటి ??

Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ కు సరికొత్త ఛాలెంజ్