AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నైలో ఎన్టీఆర్ నివాసం.. త్వరలో అభిమానులందరికీ ప్రవేశం

చెన్నైలో ఎన్టీఆర్ నివాసం.. త్వరలో అభిమానులందరికీ ప్రవేశం

Phani CH
|

Updated on: Jan 19, 2026 | 7:12 PM

Share

లెజెండరీ నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చెన్నైలోని తన చారిత్రక నివాసం త్వరలో ప్రజల సందర్శనార్థం సిద్ధమవుతోంది. 1953లో బసవతారకం పేరుతో టీ నగర్‌లో కొనుగోలు చేసిన ఈ ఇల్లు దశాబ్దాలుగా నిర్మానుష్యంగా ఉంది. ఇప్పుడు పునరుద్ధరించబడి, ఎన్టీఆర్ అభిమానుల కల నెరవేరుతోంది. ఈ భవనం ఎన్టీఆర్ సినీ ప్రస్థానం, ఆయనతో అభిమానుల అనుబంధాన్ని గుర్తుచేస్తుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు నివసించిన ఇల్లు ప్రజల సందర్శనార్థం సిద్ధమవుతోంది. నటుడిగా నిలదొక్కుకున్న తర్వాత ఎన్టీఆర్ చెన్నైలో ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన నివాసం కొన్ని దశాబ్దాలుగా నిర్మానుష్యంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ నివాసం కొత్త హంగులు రూపుదిద్దుకొని త్వరలోనే ప్రజల సందర్శనార్థం సిద్ధం కాబోతోంది. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒకప్పటి మద్రాస్ నేడు చెన్నైగా పిలవబడే నగరంలోని కొలువు తీరింది. సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలందరూ ఒకప్పుడు చెన్నైలోనే నివాసం ఉండేవారు. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సినీ పరిశ్రమను మద్రాస్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌ 1953లో చెన్నై నగరంలో టీ నగర్ గా పిలవబడుతున్న త్యాగరాయ నగర్ బజుల్లా రోడ్డులో ఆయన సతీమణి బసవతారకం పేరు మీద ఇంటిని కొనుగోలు చేశారు. అప్పట్లో మద్రాసు వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఆయన నివాసానికి వెళ్లి ఆయనను కలిసి వచ్చేవారు. ఎన్టీఆర్ నివాసానికి సమీపంలోని దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు నివాసం కూడా ఉండేది. పౌరాణిక పాత్రల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ ను అప్పట్లో అభిమానులు కనిపించే దైవంగా భావించి మద్రాస్ వెళ్ళి మరీ ఆయనను కళ్ళారా చూసి వచ్చేవారు. ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాక నివాసం అలాగే బోసిగా ఉండిపోయింది. ఎప్పటినుంచో ఎన్టీఆర్ నివాసాన్ని పునరుద్ధరించి అభిమానుల సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురావాలని కోరుతుండేవారు. దశాబ్దాల తర్వాత అభిమానుల కోరిక నెరవేరబోతోంది. ఎన్టీఆర్ కుటుంబానికి బంధువైన నిర్మాత చదలవాడ తిరుపతిరావు సోదరులు భవనాన్ని కొనుగోలు చేసి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ భవనం పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. టీ నగర్ నుంచి వడపలని వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లేటప్పుడు ఎన్టీఆర్ నివాసం స్పష్టంగా కనబడుతుంది. ఇకపై ఎన్టీఆర్ నివసించిన భవనాన్ని ప్రజలు అభిమానులు సందర్శించేందుకు వీలుగా అవకాశం కల్పించబోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా !!

యాదాద్రి జిల్లాలో పులి సంచారం.. భయం గుప్పెట్లో జనం

Jr NTR: మేకోవర్ తో మాయ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్

సింక్ అయిన దర్శకులతో సీనియర్ల సందడి

Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్