డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
కామారెడ్డిలో విషాద ఘటన: పొలం దున్నుతుండగా రైతు శ్రీను మృతి చెందగా, డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ పద్ధతిగా దున్నుతూనే ఉంది. గుండెపోటుతో శ్రీను కిందపడి, ట్రాక్టర్ కింద పడి మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఈ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. అతని కుటుంబానికి తీరని లోటు. దీనిపై మరింత దర్యాప్తు జరగాల్సి ఉంది.
కామారెడ్డి జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ పొలంలో ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దానంతటదే తిరుగుతూ పొలం దున్నుతోంది. దాంతో చుట్టుపక్కల పొలాల్లో ఉన్న వ్యక్తులు ఆ పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ట్రాక్టర్ సీట్లో డ్రైవర్ లేడు. కానీ ట్రాక్టర్ మాత్రం ఎంతో పద్ధతిగా చుట్టూ తిరుగుతూ పొలం దున్నుతోంది. ఆశ్చర్య పోయిన వారంతా ఆ పొలానికి చెందిన రైతు బొండ్ల శ్రీనుకు ఫోన్ చేశారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన వారంతా మడి మొత్తం వెతికారు. అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఓ చోట రైతు శ్రీను మట్టిలో కూరుకుపోయి ఉన్నాడు. దాంతో అందరూ ఆందోళన చెందారు. పొలం దున్నుతున్న సమయంలో గుండె పోటు వచ్చి ట్రాక్టర్ పై నుంచి కింద పడిపోయి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. కింద పడ్డాక ట్రాక్టర్ శ్రీను మీద నుంచి వెళ్లిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి.. గుండె పోటు వచ్చిందా లేదా ఇంకేదైనా కారణంతో కింద పడి ట్రాక్టర్ పై నుంచి వెళ్లి ఊపిరాడక చనిపోయాడా అనే విషయాలు తేలాల్సి ఉంది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆన్‌లో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ లేనప్పడు అదుపు లేకుండా ఎటు వాలు ఉంటే అటు వెళ్లిపోతుంది. కానీ విచిత్రంగా ఆ ట్రాక్టర్ మాత్రం ఎవరో నడుపుతున్నట్టుగా పద్ధతిగా తిరుగుతూ చాలా సమయం పొలం దున్నటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానికులంతా చూస్తుండగానే ఆ ట్రాక్టర్ రౌండ్‌గా తిరుగుతూనే ఉంది. ఆ తర్వాత ఓ రైతు ఆ ట్రాక్టర్‌పైకి ఎక్కి ఇంజిన్ ఆఫ్ చేయడంతో ట్రాక్టర్ ఆగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా.. అసలు నిజాలు తెలిస్తే షాకవుతారు
ఎండు చేపలను ఇష్టంగా తింటున్నారా.. డేంజర్ సుమా
Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే
జుట్టు రాలిపోతోందా.. ఈ డ్రింక్ ట్రై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!

