AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారాసిటమాల్ వాడకంపై ఆందోళన వద్దు.. అధ్యయనం ఏం చెప్పిందంటే

పారాసిటమాల్ వాడకంపై ఆందోళన వద్దు.. అధ్యయనం ఏం చెప్పిందంటే

Phani CH
|

Updated on: Jan 20, 2026 | 1:05 PM

Share

గర్భధారణ సమయంలో పారాసిటమాల్ వాడకంపై నెలకొన్న ఆందోళనలకు లాన్సెట్ అధ్యయనం తెరదించింది. గర్భిణులు జ్వరం, నొప్పుల కోసం పారాసిటమాల్ వాడటం వల్ల పిల్లల్లో ఆటిజం, ADHD వస్తాయనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. చికిత్స తీసుకోకపోతే తల్లీబిడ్డలకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. వైద్యుల సలహా మేరకు అవసరమైనప్పుడు పారాసిటమాల్ సురక్షితం.

గర్భధారణ సమయంలో పారాసిటమాల్ వాడకంపై నెలకొన్న ఆందోళనలకు తెరపడింది. గర్భిణులు జ్వరం లేదా నొప్పుల కోసం పారాసిటమాల్ వాడటం వల్ల పుట్టబోయే పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ , అటెన్షన్-డెఫిసిట్ లేదా హైపర్యాక్టివిటీ డిజార్డర్ వంటి నాడీ సంబంధిత సమస్యలు వస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రఖ్యాత వైద్య పత్రిక “ది లాన్సెట్” స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఒక కీలక అధ్యయనాన్ని ప్రచురించింది. లండన్‌లోని సిటీ సెయింట్ జార్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అస్మా ఖలీల్ నేతృత్వంలోని యూరోపియన్ పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా గతంలో జరిగిన 43 అధ్యయనాలను వీరు క్షుణ్ణంగా విశ్లేషించారు. కొన్ని పాత అధ్యయనాలు పారాసెటమాల్ వాడకానికి, పిల్లల ఆరోగ్యంపై ప్రభావానికి సంబంధం ఉందని చెప్పడంతో ప్రజల్లో, ముఖ్యంగా గర్భిణుల్లో ఆందోళన పెరిగింది. ఈ గందరగోళాన్ని తొలగించేందుకే ఈ “గోల్డ్-స్టాండర్డ్” సమీక్షను చేపట్టినట్లు పరిశోధకులు తెలిపారు. “గతంలో పారాసిటమాల్ వాడకానికి, పిల్లల్లోని సమస్యలకు సంబంధం ఉందని వచ్చిన నివేదికలకు మందు ప్రభావం కారణం కాకపోవచ్చని వివరించారు. జన్యుపరమైన అంశాలు లేదా గర్భధారణ సమయంలో తల్లికి వచ్చిన జ్వరం, ఇన్‌ఫెక్షన్ వంటి ఇతర సమస్యలు దీనికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తమ అధ్యయనం ప్రకారం గర్భిణులకు పారాసిటమాల్ సురక్షితమైన ఎంపిక అని ప్రొఫెసర్ అస్మా ఖలీల్ వివరించారు. తీవ్రమైన నొప్పి లేదా జ్వరం వచ్చినప్పుడు చికిత్స తీసుకోకపోవడం వల్ల తల్లీబిడ్డలకు ఎక్కువ ప్రమాదం ఉంటుందని ఈ నివేదిక హెచ్చరించింది. సరైన చికిత్స లేకపోతే గర్భస్రావం, అకాల జననం వంటి సమస్యలు తలెత్తవచ్చని పేర్కొంది. అందువల్ల, వైద్యుల సిఫార్సు మేరకు అవసరమైనప్పుడు పారాసిటమాల్ వాడటం సురక్షితమని ఈ అధ్యయనం భరోసా ఇచ్చింది. ఈ పరిశోధన ప్రపంచంలోని ప్రముఖ ఆరోగ్య సంస్థల మార్గదర్శకాలను మరింత బలపరిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!

మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా

డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా

విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

WhatsApp: యూజర్లకు వాట్సప్ గుడ్‌న్యూస్ గ్రూప్ చాటింగ్ ఫీచర్స్‌‌లో అప్‌డేట్స్