AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: శ్రీలీల భారీ ప్లానింగ్‌.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా

Sreeleela: శ్రీలీల భారీ ప్లానింగ్‌.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా

Phani CH
|

Updated on: Jan 20, 2026 | 4:36 PM

Share

శ్రీలీల టాలీవుడ్‌లో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగి, నటన, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్, బాలీవుడ్‌లలో కార్తీక్ ఆర్యన్, శివ కార్తికేయన్ వంటి స్టార్లతో బిజీగా ఉంది. 'పరాశక్తి', 'నాగ్జిల్లా' వంటి చిత్రాలతో పాన్-ఇండియా నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత టాలీవుడ్‌లో ఆమె తదుపరి పెద్ద సినిమా కోసం తెలుగు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చేతినిండా పని ఉంది. చేయాల్సినంత పని ఉంది. చేస్తున్నదంతా అందరికీ అర్థమవుతూనే ఉంది. కానీ తెలుగువారికి తప్ప. అని ఒక రకమైన ఆలోచనలో పడుతున్నారు శ్రీలీల ఫ్యాన్స్. ఈ విషయం గురించి శ్రీలీల కూడా ఓ సారి ఆలోచిస్తే బావుంటుందనే రిక్వెస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఆమెకు అర్థమవుతోందా? శ్రీలీల… ఇలా టాలీవుడ్‌లో అడుగుపెట్టి అలా.. ఓవర్‌నైట్‌ స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకున్నారు. డ్యాన్సులకు డ్యాన్సులు, పెర్ఫార్మెన్సులకు పెర్ఫార్మెన్స్ అంటూ ఏ డైరక్టర్‌కి ఆన్‌ కెమెరా ఏం కావాలో అది చేసేశారు. అందుకే ఫుల్‌ మార్కులతో డిస్టింక్షన్‌లో పాస్‌ చేశారు మేకర్స్. ఇక్కడొచ్చిన క్రేజ్‌ని పొరుగు రాష్ట్రాల్లో పైసల్‌ చేసుకుంటున్నారు శ్రీలీల. ఇక్కడ టాప్‌ హీరోయిన్‌ స్టేటస్‌ని అదర్‌ స్టేటస్‌లో ఆఫర్స్ కి వాడుకుంటున్నారు. ఆమె నటించిన పరాశక్తి కోలీవుడ్‌లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. వింటేజ్‌ లుక్స్ లోనూ శ్రీలీల అదుర్స్ అనే పేరు వచ్చేసింది. దానికి తోడు నార్త్ లోనూ శ్రీలీల యమా బిజీగా మారిపోతున్నారు. ఆల్రెడీ కార్తిక్‌ ఆర్యన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇది రిలీజ్‌ కాకముందే మరో సినిమాకు మిస్‌ లీల సైన్‌ చేశారన్నది టాక్‌. ధర్మ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న నాగ్జిల్లాలో శ్రీలీలను హీరోయిన్‌గా సెలక్ట్ చేశారట. ఈ సినిమాలోనూ కార్తిక్‌ ఆర్యనే హీరో. మరోవైపు శివ కార్తికేయన్‌తోనూ తమిళంలో ఇంకో సినిమా చేస్తున్నారన్నది టాక్‌. తెలుగులో పవన్‌ కల్యాణ్‌తో నటించిన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ఈ సమ్మర్‌కి రిలీజ్‌ అవుతుంది. ఆ తర్వాత ఆ రేంజ్‌ సినిమాకు టాలీవుడ్‌లో లీల ఎప్పుడు సైన్‌ చేస్తారన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం. అదర్‌ ఇండస్ట్రీల్లో బిజీగా ఉన్నానంటూ టాలీవుడ్‌ని పక్కన పెడతారా? లేకుంటే ఇమీడియేట్‌గా కన్సిడర్‌ చేస్తారా? అనేది తెలియాలంటే లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ…

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కటౌట్‌తో పనేంటి ?? కంటెంట్ ఉంటే చాలు.. హిట్టు పక్కా

Mahesh Babu: వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా

వంద కోట్ల క్లబ్ లో.. సత్తా చాటుతున్న సీనియర్ హీరోలు

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్.. యాక్షన్ రూట్ లో సీనియర్ బ్యూటీస్

2027 సమ్మర్ క్లాష్.. ఇప్పటి నుండే రచ్చ రచ్చ