Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో రాత్రి వేళ చలి తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ అప్డేట్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగనుంది. ఈశాన్య రుతుపవన వర్షాలు నిలిచిపోగా, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు పొగమంచు కురిసే అవకాశం ఉంది. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో మాత్రం చలి తీవ్రత పెరిగింది, సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రాత్రి వేళ చలి తీవ్రత తగ్గింది.నెమ్మదిగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. గత రెండు రోజులుగా ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాలేదు. దిగువ పొరలలో, ఉత్తర భారతదేశం నుండి పొడి గాలులు ఈ ప్రాంతంపై వీస్తున్నాయి. అందువల్ల, 2026 జనవరి 19వ తేదీ, ఈ రోజు నుండి ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో ఈశాన్య రుతుపవన వర్షాలు నిలిచిపోయాయి. రాబోయే రెండు రోజులలో ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని…వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. మోస్తరు పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. సింగిల్ డిజిట్స్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు, మినుములూరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా… పాడేరు, చింతపల్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. సంక్రాంతి తర్వాత చలి పెరగడంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తటపటాయిస్తున్నారు. రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జాతీయ రహదారిపై పొగమంచు దట్టంగా కమ్మేసింది. పొగమంచు కారణంగా హైవే పై ప్రయాణించే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజబులిటి సరిగ్గా లేక పోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. 50 మీటర్లు దూరం వరకు కూడా వాహనాలు సరిగ్గా కనపడటం లేదు. పెనుబల్లి నుంచి సత్తుపల్లి వరకు హైవేపై ప్రమాదాలు జరుగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
A.R. Rahman: ‘ఎవరినీ బలవంతం చేసి మతం మార్చరు’
అందగత్తెల రీయూనియన్.. సందడి.. సందడి చేసిన ముద్దుగుమ్మలు
AR Rahman: మాటలు కాదు.. ముందు మ్యూజిక్ మీద దృష్టి పెట్టు
తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు
Sreeleela: శ్రీలీల భారీ ప్లానింగ్.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

