తొలి జర్నీకి సిద్ధమైన వందే భారత్ స్లీపర్ రైలు! ఎన్ని టిక్కెట్లు బుక్ అయ్యాయో తెలుసా? షాకింగ్ నంబర్స్..
Vande Bharat Sleeper: కామాఖ్య-హౌరా మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలు (27576) తొలి కమర్షియల్ జర్నీకి సిద్ధమైంది. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తొలి ప్రయాణం కోసం టిక్కెట్లు బుకింగ్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే అన్ని టిక్కెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి.

కామాఖ్య టు హౌరా మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలు (27576) మొదటి కమర్షియల్ జర్నీకి రెడీ అయింది. జనవరి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇండియన్ రైల్వేస్‌కే తలమానికంగా నిలవనున్న ఈ రైలు వేగం, ఆధునిక సౌకర్యాలకు అడ్రస్‌గా మారనుంది. అయితే మరి తొలి జర్నీకి సిద్ధమైన ఈ వందే భారత్ స్లీపర్ రైలుకు ఎన్ని టిక్కెట్లు బుక్ అయ్యాయో అని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది.
వందే భారత్ స్లీపర్ రైలుకు ప్రయాణికుల నుంచి రెస్పాన్స్ అదిరిపోయిందని తొలి జర్నీ కోసం అన్ని టిక్కెట్లు 24 గంటల్లోనే బుక్ అయినట్లు రైల్వే శాఖ తెలిపింది. PRS, ఇతర సైట్‌ల ద్వారా టికెట్ రిజర్వేషన్ తెరిచిన కొన్ని గంటల్లోనే అన్ని సీట్లు బుక్ అయిపోయినట్లు వెల్లడించింది. బుకింగ్ విండోలు జనవరి 19న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. 24 గంటలలోపు అన్ని తరగతుల టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి, ఇది ప్రీమియం సెమీ-హై-స్పీడ్ సేవ పట్ల ప్రజల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుందని రైల్వే శాఖ తెలిపారు.
కామాఖ్య – హౌరా వందే భారత్ స్లీపర్ ఈశాన్య, తూర్పు భారతదేశం మధ్య కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుందని, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ సమయం, ప్రపంచ స్థాయి రాత్రిపూట ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. గంటల్లోనే పూర్తిగా బుక్ అయిన స్థితి, భారతీయ రైల్వేలు ప్రవేశపెడుతున్న ఆధునిక రైలు సేవల పట్ల ప్రయాణికుల నమ్మకం, ఉత్సాహానికి బలమైన నిదర్శనంగా నిలుస్తుంది, ఇది ఈ ప్రాంతానికి ప్రీమియం రైలు కనెక్టివిటీలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
