AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Survey: ప్యాకేజీ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ తో క్యాన్సర్ ముప్పు! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు

ఆధునిక జీవనశైలిలో మనకు సమయం దొరకడమే కష్టమవుతోంది. అందుకే త్వరగా తయారయ్యే ఇన్స్టంట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన పానీయాలు, ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాల వైపు అందరం మొగ్గు చూపుతున్నాం. కానీ మనం సౌకర్యవంతంగా భావిస్తున్న ఈ ఆహారమే మన ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని మీకు తెలుసా?

Shocking Survey: ప్యాకేజీ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ తో క్యాన్సర్ ముప్పు! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు
Junk Food..
Nikhil
|

Updated on: Jan 20, 2026 | 11:29 PM

Share

ఆహారం పాడవకుండా, ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు కంపెనీలు వాడే కొన్ని కెమికల్స్.. నిశ్శబ్దంగా మన శరీరంలో క్యాన్సర్ కణాలను పెంచుతున్నాయని తాజా అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్‌లకు ఈ నిల్వ కారకాలే ప్రధాన శత్రువులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆ ప్రమాదకరమైన ప్రిజర్వేటివ్స్ ఏంటి? వాటి వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పరిశోధనలో తేలిన చేదు నిజాలు..

ఫ్రాన్స్‌లోని ‘యూనివర్సిటీ పారిస్ సిటీ’ పరిశోధకులు సుమారు 1,05,260 మందిపై సుదీర్ఘ కాలం పాటు జరిపిన అధ్యయన ఫలితాలను ‘ది బిఎమ్​జె (BMJ)’ జర్నల్‌లో ప్రచురించారు. ప్యాక్ చేసిన ఆహారాల్లో వాడే 17 రకాల ప్రిజర్వేటివ్స్ గురించి వారు పరిశీలించగా, అందులో కొన్ని సాధారణ కెమికల్స్ క్యాన్సర్ రిస్క్‌ను విపరీతంగా పెంచుతున్నట్లు గుర్తించారు.

ప్రమాదకరమైన కెమికల్స్..

  • పొటాషియం సోర్బేట్: ఇది మొత్తం క్యాన్సర్ ముప్పును 14 శాతం, రొమ్ము క్యాన్సర్ ముప్పును 26 శాతం పెంచుతున్నట్లు తేలింది.
  • సోడియం నైట్రైట్: మాంసం నిల్వ ఉంచేందుకు వాడే ఈ కెమికల్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 32 శాతం ఎక్కువగా ఉంది.
  • పొటాషియం నైట్రేట్: దీని వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పు 22 శాతం పెరుగుతోంది.
  • సల్ఫైట్లు: ఆహారంలో వీటి పరిమాణం ఎక్కువైతే సాధారణ క్యాన్సర్ రిస్క్ 12 శాతం పెరుగుతుంది.
  • అసిటేట్లు: ఇవి రొమ్ము క్యాన్సర్ ముప్పును 25 శాతం పెంచుతాయని పరిశోధనలో వెల్లడైంది.

శరీరంపై వీటి ప్రభావం..

ఆహారం నిల్వ ఉండటానికి వాడే ఈ రసాయనాలు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు)ను పెంచి, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. సహజమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రిజర్వేటివ్స్ పెద్దగా నష్టం చేయకపోయినా.. సోడియం ఎరిథోర్బేట్ వంటి కొన్ని రసాయనాలు మాత్రం అనారోగ్యానికి కారణమవుతున్నాయి.

నివారణ మార్గాలు..

శాస్త్రవేత్తల సూచనల ప్రకారం, కేవలం ప్రాసెస్డ్ మీట్ లేదా ఆల్కహాల్ మాత్రమే కాదు.. మనం రోజూ వాడే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ప్రమాదకరమే.

  • తాజా ఆహారానికి ప్రాధాన్యత: వీలైనంత వరకు ప్యాక్ చేసిన, టిన్లలో నిల్వ ఉంచిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
  • లేబుల్స్ గమనించాలి: ఫుడ్ ప్యాకెట్ కొనే ముందు అందులో వాడిన ఇంగ్రీడియంట్స్ పొటాషియం సోర్బేట్, నైట్రేట్స్ వంటివి ఉన్నాయో లేదో గమనించండి.
  • ఆహారపు అలవాట్లు: ఇంట్లో వండుకున్న తాజాగా ఉండే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కెమికల్స్ బారి నుండి తప్పించుకోవచ్చు.

బిజీ లైఫ్‌లో ఈజీగా దొరికే ఆహారం మన ఆరోగ్యాన్ని బలి తీసుకుంటోంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లలో మార్పు రావడం అత్యంత అవసరం.