AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vasant Panchami: వారికి సరస్వతీ దేవి అనుగ్రహం.. పరీక్షల్లో బిగ్ సక్సస్ పక్కా..!

Vasant Panchami 2026: ఈ నెల (జనవరి) 23వ తేదీన వసంత పంచమి చోటు చేసుకుంటోంది. ఆ రోజున ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా, నిష్ఠగా పూజించే పక్షంలో వసంత పంచమి నాడు శుభ గ్రహాల బలం రెట్టింపవుతుందని, పాప గ్రహాల బలం బాగా తగ్గిపోతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం గురువు విద్యా కారకుడైన బుధుడి స్థానంలో ఉండడం, బుధుడు శ్రవణ నక్షత్రంలో సంచారం చేయడం వల్ల ఆ రోజు అత్యంత శుభప్రదమైన రోజుగా సాగిపోతుంది. ఈ శుభ గ్రహాల ఫలితం జూన్ వరకు కొనసాగుతుంది. వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు ఈ వసంత పంచమితో విశేష ఫలితాలు పొందడం జరుగుతుంది. మార్చి, జూన్ నెలల మధ్య కాలం విద్యార్థులకు పరీక్షా కాలం కనుక వారి లక్ష్యాలు నెరవేరడం, విజయాలు సాధించడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 20, 2026 | 7:03 PM

Share
వృషభం: పుత్ర కారకుడైన గురువు విద్యాకారకుడైన బుధుడి స్థానంలో బలంగా ఉన్నందువల్ల పిల్లల్లో చదువుల పట్ల శ్రద్ధాసక్తులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలను అలవరచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూలలోనూ తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. పిల్లల విషయంలో శుభ వార్తలు, శుభ పరిణామాలకు బాగా అవకాశం ఉంది. తల్లితండ్రులకు అనుకూలంగా మారడం జరుగుతుంది.

1 / 6
మిథునం: బుధుడికి చెందిన ఈ రాశిలో పుత్ర కారకుడు గురువు సంచారం వల్ల విద్యార్థుల ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. చదువులతో పాటు విద్యార్థులకు అనేక అంశాలు, క్రీడలు, తదితర కార్యకలాపాల మీద కూడా శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. వారిలో క్రమశిక్షణ పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. వారికి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. ఆటంకాలు, అనారోగ్యాలేవీ ఉండకపోవచ్చు.

2 / 6
కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన విద్యార్థులు తప్ప కుండా రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల్లోనే కాక, పరీక్షలు, క్రీడలు, కళల్లో కూడా రాణించే అవకాశం ఉంది. చదువులకు సంబంధించి విద్యార్థులకు అనేక అవకాశాలు అందుతాయి. ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. పిల్లలు ఆశించినదాని కంటే ఎక్కువగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. చదువుల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి.

3 / 6
తుల: విద్యకు, సంతానానికి కారకుడైన గురువు ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల విద్యార్థులు ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. పాఠ్యేతర అంశాలలో విద్యార్థులు దూసుకుపోయి, రికార్డులు సృష్టించడం జరుగుతుంది. అనేక శుభవార్తలను వినే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు తప్పకుండా తాము కోరుకున్న కోర్సుల్లో చేరడం జరుగుతుంది. విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ యోగానికి అవకాశం ఉంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి గురువు సప్తమ స్థానంలో బుధుడికి చెందిన మిథున రాశిలో సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. చదువులను నిర్లక్ష్యం చేస్తున్న విద్యార్థులు కూడా చదువుల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. విద్యార్థులలో చాలా మార్పు చోటు చేసుకుంటుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం, మరిన్ని నైపుణ్యాల కోసం విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. టెక్నికల్, టెక్నలాజికల్ రంగాల్లో బాగా రాణిస్తారు. ఆశించిన గుర్తింపు పొందుతారు.

5 / 6
కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశికి చెందిన విద్యార్థులకు తప్పకుండా చదువుల మీద, కళలు, పాఠ్యేతర అంశాల మీద శ్రద్ధ పెరుగుతుంది. క్రమ ‍శిక్షణ పెరగడం, చదువులతో పాటు క్రీడలు, కళా రంగాల్లో రాణించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. విద్యార్థుల మీద పెట్టుకున్న ఆశలన్నీ పూర్తిగా నెరవేరుతాయి. ఉన్నత విద్యకు వెళ్ల డం, ఇష్టపడిన కోర్సులో చేరడం, మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించడం వంటివి జరుగుతాయి.

6 / 6
Follow Us
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?

చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?

స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే

ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్

కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్

వామన జయంతి నాడు విష్ణువును ఇలా పూజిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం..

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే