కామా తురాణం న భయం న లజ్జ.. ముసుగేసుకున్న పెద్ద మనుషులు.. తెర వెనక మదనకామరాజులు
వైరల్ అయితే.. మరింత ఫేమస్ అవుతారు. వచ్చిన క్రేజ్‌తో మరో లెవెల్‌కి వెళ్తారు. బట్.. వైరల్ కాకూడని వీడియోస్ ఉంటాయ్. అందులో ఒక్కటి బయటికొచ్చినా చాలు.. కెరీర్ ఖతమ్. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. ఎంతోమంది అత్యున్నత స్థాయి ఉద్యోగులు, రాజకీయ ఉద్ధండుల పొలిటికల్ లైఫ్, ఉద్యోగుల కెరీర్ ముగిసిపోయాయ్. అలాంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని కొందరు.. బలహీనతకు లొంగిపోయి పరువు కూడా పొగొట్టుకున్నారు. అలాంటి వాటిలో నేషనల్ వైడ్ సెన్సేషన్ అయిందే రామచంద్రరావు ఎపిసోడ్.

రీజనల్ ఛానెల్స్ నుంచి నేషనల్ ఛానెల్స్ వరకు.. రోజంతా అవే వీడియోలు ప్లే అయ్యాయి. ఎంతైనా డీజీపీ ర్యాంక్ పోలీస్ కదా. అందుకే అంత వైరల్ అయ్యాయా వీడియోలు. ఆయన ముందు మైక్ పెట్టి.. ఏంటీ పనులు అని అడిగితే ఏం చెప్పాడో తెలుసా. ‘అయ్యో.. అందులో ఉన్నది తాను కాదు… అదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో’ అని లబోదిబోమన్నారు. ఆ వీడియోలను మరొక్కసారి చూసుకున్న కర్నాటక సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీ రామచంద్రరావు.. ‘చూస్తుంటే నాకే షాక్‌గా ఉంది.. ఇదంతా అబద్ధం’ అని చెబుతున్నారు. ఇంకోమాటన్నారు… ‘ఎవరు, ఎందుకు ఇలా చేశారో అర్ధం కావడం లేదు’ అని. ఏఐ వీడియోకి, రియల్ వీడియోకి తేడా తెలియనంత అమాయకులేం లేరిక్కడ. అసలు.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఏఐనో కాదో చెక్ చేయక్కర్లేదు. ఆ వీడియోలో కనిపిస్తున్న రామచంద్రరావు హిస్టరీ చెక్ చేసినా చాలు. రామచంద్రరావు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం వివాదాస్పదమే అనే టాక్ ఉంది. గతంలో బెళగావిలో పనిచేస్తుండగా ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. అప్పట్లోనే పోలీస్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి ఆ వీడియో చూసి. ఇక గతేడాది మార్చిలో కన్నడ నటి రన్యారావు.. విదేశాల నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఆ కేసు కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాదు.. దేశవ్యాప్తంగా కలకలం...
