AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pralhad Joshi: రాహుల్‌కు అవగాహన లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. రాహుల్‌కు రాజ్యాంగ నియమాల గురించి తెలియదని.. ఏదైనా ఆరోపణలు చేసే ముందు వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను దగ్గరపెట్టుకొని మాట్లాడాలన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ బడ్జెట్ గురించి కాకుండా మిగతా విషయాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Pralhad Joshi: రాహుల్‌కు అవగాహన లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
Prahlad Joshi's Criticism Of Rahul Gandhi
Anand T
|

Updated on: Feb 11, 2026 | 4:45 PM

Share

లోక్‌సభలో యూనియన్ బడ్జెట్ చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. ఎవరైనా, ఏదైనా ఆరోపణ చేసే ముందు వాటికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్‌ను దగ్గర ఉంచుకొని మాట్లాడాలన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగ నియమాలపై ఏమాత్రం అవగాహన లేదని.. అందుకే ఆయన ఏదో ఒకటి చెప్పేస్తుంటారని ఆయన మండిపడ్డారు.

రాహుల్ గాంధీకి చరిత్ర గురించి తెలియదని.. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడు కాదని.. ఆయన మా పార్టీలోని వ్యక్తని చెప్పి స్పీకర్‌ను అవమానించడం ద్వారా రాహుల్ ఎల్‌ఓపీ స్థానాన్ని తక్కువ చేస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు. కేవలం రాజకీయ లాభాల కోసం మాత్రమే సభలో రాహుల్ మాట్లాడారని.. అందుకే బడ్జెట్ గురించి తప్ప మిగతా అన్నింటిపై మాట్లాడారని చెప్పుకొచ్చారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.