AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల వేళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కీలకం. కూటమి ఐక్యత, రాష్ట్ర అభివృద్ధికి కృషి, వైసీపీ కుట్రలపై అప్రమత్తతపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు చర్చించారు. సమస్యల పరిష్కారం, అసెంబ్లీలో సమన్వయంతో పనిచేసి వైసీపీని టార్గెట్ చేయాలని నిర్ణయించారు.

కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
Ap Cm Chandrababu
Jyothi Gadda
|

Updated on: Feb 11, 2026 | 10:15 PM

Share

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించికుంది. కూటమి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. నిబద్ధత లేకపోతే ఫలితాలు కష్టమన్నారు. 20 నెలల కూటమి పాలనలో ఎక్కడా విభేదాలు లేవన్నారు చంద్రబాబు. కూటమి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సీరియస్‌గా తీసుకోవాలన్నారు చంద్రబాబు. సభ్యలు ప్రసంగాలు వింటా.. మంత్రుల సమాధానమూ వింటా అన్నారు చంద్రబాబు.

వైసీపీ కుట్రలపై మూడు పార్టీలు అప్రమత్తంగా ఉండాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. వైసీపీ విధ్వంస కుట్రలపై చర్చించాలన్నారు. మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని YCP చూస్తోందన్నారు పవన్.

ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా కూటమి ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకోవడంతో ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరారు. కూటమిలో విభేదాలకు తావు ఉండొద్దని మూడు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

లడ్డూ కల్తీ విషయంలో కూటమి నేతలంతా ఒకేమాట మీద ఉన్నారు. వైసీపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలోనూ ఐక్యతా రాగం వినిపిస్తూ వైసీపీని టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యారు కూటమి సభ్యులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం