విద్యార్థుల భవిష్యత్‌కు దారి చూపే మహా వేదిక! విజయవాడ & విశాఖపట్నంలో టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 ప్రారంభం
TV9 Education Expo 2026: హైదరాబాద్‌లో ఘన విజయాన్ని సాధించిన TV9 & KAB Education Expo 2026 ఇప్పుడు విజయవాడలో ప్రారంభమైంది. మే 30, 31 తేదీల్లో SS Convention Centre, లబ్బీపేటలో నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పో, మే 31న Novotel Visakhapatnam, డా. ఎన్టీఆర్ బీచ్ రోడ్లో కూడా జరగనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై విలువైన సమాచారాన్ని అందించనుంది.

విజయవాడ, మే 30: హైదరాబాద్‌లో ఘన విజయాన్ని సాధించిన అనంతరం TV9 & KAB Education Expo 2026 ఇప్పుడు విజయవాడలో విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రారంభమైంది. మే 30, 31 తేదీల్లో విజయవాడలోని SS Convention Centre, లబ్బీపేటలో ఈ ఎక్స్‌పో నిర్వహించబడుతోంది. అలాగే విశాఖపట్నంలో మే 31న Novotel Visakhapatnam, Dr. NTR Beach Roadలో ఈ కార్యక్రమం జరగనుంది. TV9 Network ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత విద్యా అవకాశాలు, సరైన కోర్సుల ఎంపిక, కెరీర్ మార్గదర్శకత్వంపై సమగ్ర అవగాహన కల్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా విద్యార్థులకు కెరీర్ ప్లానింగ్, సరైన కోర్సులు, కాలేజీల ఎంపిక, ఉన్నత విద్య అవకాశాలపై మార్గదర్శకత్వం అందిస్తున్న KAB Educational Consultants ఈ కార్యక్రమంలో భాగస్వామిగా ఉంది.
ఈ ఎక్స్‌పోలో దేశవ్యాప్తంగా ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీలు, డీమ్డ్ టు బీ యూనివర్సిటీలు పాల్గొంటున్నాయి. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, లా, అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మీడియా, డిజైన్, హోటల్ మేనేజ్‌మెంట్, ఏవియేషన్ తదితర రంగాలకు సంబంధించిన కోర్సులపై విద్యార్థులు పూర్తి సమాచారం పొందే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి ఉచిత నిపుణుల కౌన్సెలింగ్. విద్యార్థుల అర్హతలు, ఆసక్తులు, పరీక్ష ఫలితాల ఆధారంగా సరైన కోర్సులు, కాలేజీల ఎంపికపై నిపుణులు ప్రత్యక్షంగా సలహాలు అందిస్తున్నారు. అలాగే AP-EAPCET, NEET, JEE, ICET, JoSAA వంటి ప్రధాన ప్రవేశ పరీక్షల అనంతరం వెబ్ కౌన్సెలింగ్ విధానం, కోర్సుల ఎంపికపై ప్రత్యేక మార్గదర్శకత్వం కూడా అందిస్తున్నారు.
విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ ఎక్స్‌పోను సందర్శించి విద్యా అవకాశాలు, అడ్మిషన్ ప్రక్రియలు, భవిష్యత్ కెరీర్ అవకాశాలపై స్పష్టత పొందవచ్చు. ఒకే వేదికపై సమగ్ర విద్యా సమాచారం, నిపుణుల మార్గదర్శకత్వం అందుబాటులో ఉండటం ఈ ఎక్స్‌పో ప్రత్యేకత.
వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ విద్యా ప్రణాళికలకు దిశానిర్దేశం చేస్తున్న TV9 & KAB Education Expo 2026, విద్యార్థుల కెరీర్ ప్రయాణంలో కీలక వేదికగా నిలుస్తోంది. ఈ ఎక్స్‌పోకు వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులందరికీ ప్రవేశం పూర్తిగా ఉచితం.
పూర్తి షెడ్యూల్:
విజయవాడలో
- వేదిక: SS Convention Centre, లబ్బీపేట
- తేదీలు: మే 30 & 31, 2026
- సమయం: ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు
విశాఖపట్నంలో..
- వేదిక: Novotel Visakhapatnam, Dr. NTR Beach Road
- తేదీ: మే 31, 2026
- సమయం: ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు
- ప్రవేశం పూర్తిగా ఉచితం.
