AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం.. గుత్తులు గుత్తులుగా విరబూసిన బ్రహ్మ కమలం పుష్పాలు

ప్రకృతిలో అనేక రకాల చెట్లు, మొక్కలుంటాయి. వాటిలో వేటికవే ప్రత్యేకం. కొన్నింటిని మాత్రం అత్యంత పవిత్రంగా చూసుకుంటాం. కొన్ని రకాల మొక్కలు, చెట్లు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉండడమే కాకుండా ఇంటికి సానుకూల శక్తి శాంతిని కూడా చేస్తాయని నమ్మకం. అలాంటి అరుదైన మొక్కల్లో ఒకటి బ్రహ్మ కమలం.

Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: May 30, 2026 | 9:26 AM

Share
బ్రహ్మ కమలం పుష్పాలు అరుదుగా మనకు కనిపిస్తుంటాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ పుష్పాలు వికసిస్తాయి. బ్రహ్మ కమలం పుష్పానికి హిందూ సంప్రదాయంలో చాలా విశిష్టత కలిగి ఉంది. హిమాలయాల్లో దొరికే ఈ అరుదైన మొక్కను పెంచే అదృష్టం చాలా తక్కువ మంది మాత్రమే కలుగుతుంది. అద్భుతమైన పరిమళంతో ఉండే బ్రహ్మ కమలం.. అర్థరాత్రి సమయంలో వికసించి కొన్ని గంటలు మాత్రమే ఉండి వాడిపోతాయి. మామూలుగా ఒక బ్రహ్మ కమలం పూస్తేనే జనం ఆత్రుతగా చూస్తుంటారు. కానీ అల్లూరి జిల్లాలో మాత్రం గుత్తులుగా విరబూసిన పుష్పాలు కను విందు చేశాయి.

1 / 5
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ దుచ్చరపాలెం గ్రామంలో అరుదైన బ్రహ్మ కమలం పుష్పాలు విరబూసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉపాధ్యాయుడు సాగిన లక్ష్మణరావు నివాస గృహంలో ఈ పుష్పాలు వికసించాయి. తెల్లని వర్ణంతో అందంగా వికసించిన బ్రహ్మ కమలాలను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ పుష్పాలు అరుదుగా పూయడంతో అదృష్టంగా భావిస్తున్నారు.

2 / 5
 బ్రహ్మ కమలం అత్యంత అరుదుగా కనిపిస్తుంది. రాత్రిపూట మాత్రమే వికసిస్తూ పరిమళం వెదజల్లుతుంది. ఆకర్షణీయమైన రూపం, దాని సువాసన కారణంగా హిమాలయాల రాణి, నైట్ క్వీన్ అని కూడా పిలుస్తారు. హిందూమతంలో బ్రహ్మ కమలాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పుష్పం పెరట్లో పూస్తేఆ ఇంటికి అదృష్టం తలుపు తడుతుందని నమ్మకం. కేదార్ నాథ్ బద్రీనాథ్  వంటి దేవాలయాల్లో శివుడు విష్ణువులను ఈ పూలతో పూజిస్తారు. ఈ పుష్పాన్ని దర్శించుకునే భాగ్యం కలిగితే కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఇంట్లో శ్రేయస్సు సానుకూల శక్తి వస్తుందని నేను నమ్మకం.

3 / 5
బ్రహ్మ కమలం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు.. అద్భుతమైన ఔషధ గుణాలు కూడా కలిగి ఉందని చెబుతుంటారు. ఈ పూలు, ఆకులు ఆయుర్వేదం టిబిటెన్ వైద్యంలోనూ వినియోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా బ్రహ్మ కమలం ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి వ్యాపిస్తుందని అంటారు. ఆర్థిక సంక్షోభం తొలిగిలక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్క ఏంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందనేది నమ్మకం.

4 / 5
ఈ మొక్క పెంచి భాగ్యం అందరికీ ఉండదట. ఎందుకంటే.. కొన్నిచోట్ల మాత్రమే ఈ మొక్క పెరుగుతుంది. అది కూడా కొన్ని చోట్ల మాత్రమే మొక్కలకు అరుదుగా ఈ పూలు వికసిస్తాయి. అందుకే కేవలం ఈ మొక్కలను పెంచడమే కాదు.. ఆ పూలు వికసిస్తే దాని దర్శనం కూడా భాగ్యంగా భావిస్తారు. అందుకే ఆ అరుదైన దృశ్యం చూసేందుకు ఛాన్స్ వదులుకోరు.

5 / 5
Follow Us