AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రాండ్ ఎంపరర్ హోటల్‌లో తవ్విన బంగారు ఇటుకల అమ్మకం.. ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

బంగారం ధర భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక కేజీ లేదా అంతకంటే ఎక్కువ బంగారం దొరికితే, మన ఆనందానికి అవధులు ఉండవు.. అలాంటి ఒక అద్బుతమైన, సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యే సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు..ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా, పసుపు లోహం ధర ఆకాశాన్నంటుతున్న సమయంలో ఈ వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

గ్రాండ్ ఎంపరర్ హోటల్‌లో తవ్విన బంగారు ఇటుకల అమ్మకం.. ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!
Macau Grand Emperor Hotel
Jyothi Gadda
|

Updated on: Feb 08, 2026 | 7:08 PM

Share

చైనాలోని మకావులో ఉన్న ప్రసిద్ధ గ్రాండ్ ఎంపరర్ హోటల్ అత్యంత ఖరీదైన,విలాసవంతమైనది. గతంలో దాని లగ్జరీ లాబీ గ్రౌండ్‌ఫ్లోర్‌ కింద కిలోల బరువైన బంగారు ఇటుకలతో నిర్మించి బడి ఉంది. కానీ, ఇప్పుడు, హోటల్ దాదాపు ఆ బంగారు ఇటుకలన్నింటినీ వెలికితీసి విక్రయించింది. మకావు చైనా గేమింగ్ రాజధానిగా పిలువబడుతుంది. క్యాసినోలు చట్టబద్ధంగా ఉన్న ఏకైక ప్రదేశం ఇదే. కానీ, బీజింగ్ ప్రభుత్వం ఇటీవల ఆర్థిక వైవిధ్యీకరణ కోసం ఒత్తిడి చేస్తోంది. స్థానిక నిబంధనలు కఠినతరం కావడంతో అనేక క్యాసినోలు మూసివేయబడుతున్నాయి. కాబట్టి, గ్రాండ్ ఎంపరర్ హోటల్ కూడా గత అక్టోబర్‌లో దాని క్యాసినో కార్యకలాపాలను నిలిపివేసింది. ఇప్పుడు ఇతర రకాల వినోదాలపై దృష్టి సారించింది.

2006లో ప్రారంభమైన గ్రాండ్ ఎంపరర్ హోటల్, దాని ప్రవేశద్వారం వద్ద గాజు కింద అమర్చబడిన అనేక నాణ్యమైన బంగారు ఇటుకలతో పర్యాటకులను ఆకర్షించేది. కానీ, ఇటీవలి మార్కెట్ పరిస్థితి బంగారాన్ని అమ్మడానికి గొప్ప అవకాశమని హోటల్ యాజమాన్యం విశ్వసిస్తోంది. హోటల్ ప్రవేశ ద్వారం వద్ద గాజు కింద ఏర్పాటు చేసిన ఇటుకలు మొత్తం 79 కిలోల బరువు కలిగి ఉన్నాయి. వాటిని హాంకాంగ్ రిఫైనర్‌కు విక్రయించారు. ఈ లావాదేవీ కంపెనీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని, భవిష్యత్ పెట్టుబడులకు సహాయపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఇటుకలను అమ్మడం ద్వారా హోటల్ యాజమాన్యం దాదాపు $13 మిలియన్లు (సుమారు రూ.117 కోట్లు) సంపాదించినట్టుగా సమాచారం.

బంగారం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును హోటల్ కొత్త సౌకర్యాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగించనున్నట్లు సమాచారం. ఆధునిక డిజైన్, డిజిటల్ వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ అనుభవాలను మరింత మెరుగుపరచడానికి ప్రణాళికలు చేస్తున్నారు. విలాసానికి చిహ్నంగా ఉన్న గోల్డెన్ పాత్ ఇప్పుడు లేనప్పటికీ, హోటల్ మరోసారి కొత్త థీమ్ ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తుందని నిర్వహణ బోర్డు నమ్మకంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?