AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత పని చేశావ్ సత్య.. అనుమానం రాకుండా బోరున ఏడ్చింది.. చివరకు ఏం జరిగిందంటే..

అనకాపల్లి జిల్లా కశింకోటలో 85 ఏళ్ల వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత దోపిడీ దొంగల పని అనుకున్న పోలీసులు, లోతుగా దర్యాప్తు చేయగా ఇంటి దొంగే హత్య చేసినట్లు తేలింది. అప్పుల ఒత్తిడితో పెద్దమ్మ బంగారు ఆభరణాలపై కన్నేసిన మేనకోడలు సత్య, ఆమెను గొంతు నులిమి హత్య చేసి ఆభరణాలు అపహరించింది.

ఎంత పని చేశావ్ సత్య.. అనుమానం రాకుండా బోరున ఏడ్చింది.. చివరకు ఏం జరిగిందంటే..
Woman Crime News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: May 30, 2026 | 10:58 AM

Share

ఓ వృద్దురాలు.. ఇంట్లో ఒంటరిగా నివాసముంటుంది. వయసు 8 పదులు దాటినా సరే యాక్టివ్‌గా ఉండేది ఆమె.. ఓ రోజు ఒక్కసారిగా విగత జీవిగా మారింది. శరీరంపై ఉన్న బంగారం మాయమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తొలుత దోపిడి దొంగల పనిగా అనుమానించారు. ఆ తర్వాత విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏం జరిగిందో తెలుసా? ఇంటి దొంగే హత్య చేసి ఆపై సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఎవరికి అనుమానం రాకుండా అందరితో పాటు కలిసి వృద్ధురాలు మృతదేహం దగ్గర కన్నీరు కూడా పెట్టింది. ఇంతకీ ఆ ఇంటి దొంగ ఎవరు..? అనకాపల్లి జిల్లా.. కశింకోటలో కొద్దిరోజుల క్రితం ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం వెనుక మిస్టరిని పోలీసులు ఛేదించారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం..

కశింకోట కస్పావీధిలో దమ్ము నాగమ్మ అనే ఎనభై అయిదేళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈనెల 16వ తేదీ రాత్రి ఆమె అనుమానస్పదంగా మృతి చెందింది. కశింకోట పోలీసులు.. సీన్ ఆఫ్ అఫెన్స్ ను పరిశీలించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎన్టీఆర్ ఆసుపత్రికి పంపారు. చెవిలో దుద్దులు, మెడలో చైన్ మాయమవడంతో.. దోపిడీ దొంగల పనిగా కొలుత అనుమానించారు. పోస్టుమార్టం రిపోర్ట్ అందింది. గొంతు నులమడంతో వృద్ధురాలు మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. దీంతో మరింత పోలీసుల లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. . నాగమ్మ చెల్లెలు కుమార్తె సిమ్మ సత్య ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలింది. పెద్దమ్మను.. ఆభరణాల కోసం హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు.

అలా ప్లాన్ చేసి..

అనకాపల్లి మండలం కొప్పాకలో నివాసం ఉంటుంది మృతురాలి చెల్లెలి కూతురు సిమ్మ సత్య. అప్పుడప్పుడు పెద్దమ్మ వద్దకు వస్తుండేది. ఇటీవల కాలంలో సత్యకు అప్పులు పెరిగాయి. అప్పు ఇచ్చినవారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో.. ఈనెల 16న కశింకోటకు వచ్చిన సత్య… బంగారు చెవిదిద్దులు, గొలుసు తాకట్టు పెట్టుకోవడానికి ఇవ్వాలంటూ పెద్దమ్మను అడిగింది. అందుకు నాగమ్మ నిరాకరించడంతో చున్నీతో గొంతు బిగించి హత్య చేసింది. ఆ తరువాత రాత్రికి సత్య ఇంటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం తిరిగి ఇంటికి వచ్చి నాగమ్మ చెవిదిద్దులు, గొలుసు అపహరించింది.

అనుమానం రాకుండా.. బోరున ఏడ్చి

స్థానికులు తలుపులు తెరిచి చూసేసరికి నాగమ్మ స్పృహలో లేకపోవడంతో.. అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో నాగమ్మ బంధువులు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సత్య కూడా అక్కడకు చేరుకుని.. బందువుల మధ్యనే ఉంటూ తన పెద్దమ్మ చనిపోయిందంటూ బోరున ఏడుస్తూ అందరినీ నమ్మించాలని చూసింది.

నాగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.. దోపిడీ దొంగల పనిగా అనుమానించినప్పటికీ.. ఎవరో బాగా తెలిసిన వ్యక్తి ఈ పని చేసి ఉంటారని పోలీసులుకు చిన్న క్లూ అందింది. అనుమానీతులను విచారించేసరికి అసలు విషయం తేలింది. దీంతో సత్యను కశింకోట పోలీసులు అరెస్టు చేశారు. కొప్పాకలో మరో మహిళ వద్ద తాకట్టుపెట్టిన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే