AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?

Horoscope Today (June 25, 2026): గురువారం 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం పరంగా గ్రహాల ప్రభావం ఎలా ఉండనుంది? ఏ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది? ఎవరు కీలక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మేషం నుంచి మీనం వరకు పూర్తి రాశిఫలాలు తెలుసుకోండి.

జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
Horoscope Today 25 June 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూన్ 25, 2026): మేష రాశి వారు ఉద్యోగంలో కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. కీలక బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అత్యంత ఉత్సాహంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. రాజకీయ ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది.. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా మీ విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతుంది. అనుకున్న శుభవార్తలు వింటారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. కీలక బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులకు కూడా మంచి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. బంధుమిత్రుల్లో కొందరికి ధన సహాయం చేయాల్సి వస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ఊపందుకుంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగపరంగా కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్న మైనా సఫలం అయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం మెరుగ్గా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. అనుకోకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. అత్యవసర పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలుంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూలతలు కనిపిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపా రాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యోగాల్లో బాగా పురోగతి చెందుతారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగవచ్చు కానీ, అందుకు తగ్గట్టుగా వృథా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యో గులకు మంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ వాతావరణం చక్కబడుతుంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా, సాఫీగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల నుంచి అవసర మైన, ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. దగ్గర బంధువుల రాకపోకలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా సాగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థికపరంగా ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని ఒక పద్ధతి ప్రకారం చక్కబెడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. కుటుంబం మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకువస్తాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి జీవితం అంచనాలకు మించి బిజీ అవుతుంది. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వ్యక్తిగత వ్యవహారాల్లో అశ్రద్ధ తగదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం అవసరం. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మితిమీరిన ఔదార్యాన్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో బాగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగి పోతుంది. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

Also Read: ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!

Follow Us
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే