AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar: బుధుడి అస్థిర సంచారం.. వారి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు..!

Budh Gochar 2026: బుధుడు జూన్ 23 నుంచి ఆగస్టు 23 వరకు మిథున, కర్కాటక రాశుల మధ్య అస్థిరంగా సంచరించనున్నాడు. దీని ప్రభావంతో వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశుల వారి కెరీర్, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరికి రాజయోగాలు, ధనయోగాలు కలిగితే, మరికొందరు బుధుడి వక్రగతి సమయంలో ఆర్థిక నిర్ణయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Budh Gochar: బుధుడి అస్థిర సంచారం.. వారి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు..!
Mercury Transit 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 24, 2026 | 4:52 PM

Share

బుద్ధి కారకుడైన బుధుడు ఆగస్టు 23 వరకు మిథున, కర్కాటక రాశుల మధ్య అస్థిరంగా సంచారం చేయడం జరుగుతోంది. జూన్ 23న మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశి స్తున్న బుధుడు.. ఆ రాశిలో జూలై 2 వక్రించి, 7వ తేదీన మళ్లీ మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్టు 7న కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆగస్టు 23 వరకు అందులోనే కొనసాగడం జరుగుతుంది. బుధుడి అస్థిర సంచారం వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశులవారి అదృష్టాల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు తన స్వక్షేత్రమైన మిథున రాశిలో ఉన్నంత కాలం ఈ రాశివారి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమ వుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. తృతీయ స్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశించి వక్రించినప్పుడు మాత్రం ఆదాయ వృద్ధి ప్లాన్లు, ప్రణాళికలు తలకిందులవుతాయి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
  2. మిథునం: రాశ్యధిపతి బుధుడు ఈ రాశిలో ఉన్నప్పుడు, ధనస్థానంలోప్రవేశించినప్పుడు తప్పకుండా రాజ యోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అయితే, కర్కాటక రాశిలో వక్రించినప్పుడు మాత్రం ధన నష్టం, డబ్బుమోసపోవడం వంటివి జరుగుతాయి.
  3. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం తప్పకుండా రాజయోగాలను కలిగిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. వృత్తి, వ్యాపారాలు ఒక వెలుగు వెలుగుతాయి. లాభ స్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ధన లాభాలు ఎక్కువగా కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. బుధుడు వక్రించినప్పుడు ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది.
  4. తుల: ఈ రాశికి భాగ్యస్థానమైన మిథునంలో బుధుడు సంచారం చేస్తున్న సమయంలో ఈ రాశివారికి అనేక విధాలుగా ఆదాయం కలిసి రావడం, ఉద్యోగపరంగా అదృష్టాలు పట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. అయితే, కర్కాటకంలో వక్రించినప్సుడు మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అదృష్టాలు తిరగబడే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశికి షష్ట స్థానమైన మిథున రాశిలో బుధుడు సంచారం చేస్తున్నప్పుడు ఈ రాశివారికి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కొద్దిగా మందగిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కష్టంగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్యాలు కూడా ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలుంటాయి. ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు మాత్రం ఆదాయం బాగా వృద్ధి చెంది, జీవితం అన్నివిధాలా సానుకూలంగా మారిపోతుంది.
  7. కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నంత కాలం ఈ రాశివారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. సమర్థతకు గుర్తింపుగా ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కర్కాటక రాశిలో ప్రవేశించి వక్రగతి పట్టినప్పుడు మాత్రం ఆదాయాన్ని మించి ఖర్చులు పెరగడం, ధననష్టం జరగడం, డబ్బు మోసపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది.

Follow Us