AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం, వెండి ధరలు పెరిగి, అంతా రివర్స్!.. గ్రౌండ్‌జీరోకు పడిపోయిన గోల్డ్‌స్మిత్ బిజినెస్..

బంగారం ధరల పెరుగుదల వల్ల స్వర్ణకారులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు అందమైన ఆభరణాలు సృష్టించిన వారి చేతులు ఇప్పుడు రోజు కూలీ కోసం వేడుకుంటున్నాయి. పనిలేక, అప్పుల పాలై, కొందరు ఆటో డ్రైవర్లుగా మారగా, మరికొందరు వృత్తిని వదిలి ఇతర పనులు వెతుక్కుంటున్నారు. వారి జీవనాధారం ప్రశ్నార్థకమై, కుటుంబాలు చితికిపోతున్నాయి. ఈ సమస్య ఏపీ, తెలంగాణలో తీవ్రంగా ఉంది.

బంగారం, వెండి ధరలు పెరిగి, అంతా రివర్స్!.. గ్రౌండ్‌జీరోకు పడిపోయిన గోల్డ్‌స్మిత్ బిజినెస్..
Goldsmith Suffer
Jyothi Gadda
|

Updated on: Feb 10, 2026 | 6:30 AM

Share

ఏళ్ల తరబడి బంగారాన్ని కరిగించి అందమైన ఆభరణాలు తయారుచేసిన ఆ చేతులు.. ఇప్పుడు రోజు కూలీ కోసం వేడుకుంటున్నాయి. కొందరు ఆటో డ్రైవర్లుగా మారితే, మరికొందరు వాచ్‌మన్‌లుగా, గుమాస్తాలుగా పొట్టపోసుకుంటున్నారు. రోజురోజుకూ బతుకుమీద ఆశలు చచ్చిపోతుంటే, స్వర్ణకారుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. పెరిగిన పసిడి ధరలు కొనుగోలుదారుల్నేమో గాని, ఆభరణాల తయారీదారుల బతుకుల్ని వెక్కిరిస్తున్నాయి.

పసిడి ధరలు పెరగడం పెట్టుబడిదారులకు లాభం కావచ్చు… కానీ అదే పెరుగుదల వేలాది కుటుంబాల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది. బంగారం ధరలు ధగధగా మెరుస్తున్నా… స్వర్ణకారుల జీవితాలు మాత్రం మసకబారుతున్నాయి. ఒకప్పుడు శుభకార్యాలు, పండుగలు వస్తే రోజుకు గంటల తరబడి పని దొరికేది. ఆభరణాల తయారీతోనే రాత్రింబవళ్లు గడిచేవి. కానీ, ఇప్పుడు పనిలేక ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఆర్డర్లు దారుణంగా పడిపోయి, రోజువారీ ఆదాయం తగ్గిపోయి, కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది.

శుభ ముహూర్తాలు ఉన్నా… ధరలు దిగిరాక కొనుగోలుదారులు షాపుల వైపే చూడ్డం లేదు. ఫలితం… కొత్త ఆభరణాల తయారీ నిల్. పాత బంగారం మార్చుకోవడానికే పరిమితం. అమ్మకాల్లేక జ్యూయెలరీ షాపులే మూత పడుతున్నాయి. ఇక స్వర్ణకారుల కుటుంబాల్ని ఎవరు పట్టించుకుంటారు? కొందరైతే వృత్తినొదిలి మరో పని వెతుక్కుని పారిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సగటు స్వర్ణకారుడి దీనావస్థ. అటు, ఏపీలోనూ ఏ ఊరిని కదిపినా ఇదే గోడు. విజయవాడ స్వర్ణకారుల పనితనానికి కేరాఫ్ అని పేరు. వన్ టౌన్, లబ్బీపేట, బెంజ్ సర్కిల్ ఏరియాల్లో వేలాదిమంది స్వర్ణకారుల కుటుంబాలు ఇదే పనిమీద ఆధారపడి బతుకుతున్నాయి. ట్రెడిషనల్ జ్యూయెలరీకైనా, కొత్త డిజైన్లకైనా ఇక్కడి స్వర్ణకారులవైపే చూస్తారు. ఇంతటి డిమాండున్న వీళ్ల నైపుణ్యం.. ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా పోతోంది.

కొన్ని నెలలుగా బంగారం-వెండి ధరలు ఆకాశాన్నంటడంతో ఆర్డర్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఫలితం బెజవాడ గోల్డ్‌స్మిత్ రంగం కుదేలైంది. పని లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. షాపు అద్దెలు, కరెంట్ బిల్లులు, కుటుంబ ఖర్చులు భరించలేక గాల్లోకి దీనంగా చూస్తూ గడిపేస్తున్నాడు సగటు స్వర్ణకారుడు.

లక్షలు పోసి డైమిషన్లు, పాలిషింగ్ యూనిట్లు, చైన్ మేకింగ్, కటింగ్, శుద్ధి యంత్రాలు కొనుక్కున్నారు. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. పెట్టుబడికి తగ్గ రాబడి లేక అప్పులపాలౌతున్నామని లబోదిబోమంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ వచ్చినా ఆర్డర్స్ మాత్రం ఊపందుకోలేదు. దీంతో, పనిలేక దిగాలుపడి ఉస్సూరుమంటున్నారు స్వర్ణకారులు.

ధరలు పెరిగి కొనుగోళ్లు మందగించడమే కాదు, ఆ కొనేవాళ్లు కూడా బంగారాన్ని పెట్టుబడి మార్గంగానే చూస్తున్నారు. అందుకే బిస్కెట్లు, కాయిన్స్ మీదే మొగ్గుచూపుతున్నారు. కానీ, కన్‌జ్యూమర్ సెంటిమెంట్ మారి, తులమో అరతులమో ఆ కొనేదేదో ఆర్నమెంట్ బంగారమే కొనుక్కుంటే.. దాని ఫలితం స్వర్ణకారుల జిందగీల మీద కనిపిస్తుందని చిన్నచిన్న ఆశ.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?