AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా వాటర్‌ మెట్రో.. కేంద్రం మెగా ప్లాన్‌

దేశవ్యాప్తంగా వాటర్‌ మెట్రో.. కేంద్రం మెగా ప్లాన్‌

Phani CH
|

Updated on: Feb 11, 2026 | 5:49 PM

Share

కేంద్ర ప్రభుత్వం రూ. 9,280 కోట్లతో భారీ 'వాటర్ మెట్రో' ప్రాజెక్టును దేశవ్యాప్తంగా 18 నగరాల్లో అమలు చేయనుంది. ట్రాఫిక్ కష్టాలను తగ్గించి, రవాణా సమయాన్ని ఆదా చేసే ఈ ప్రాజెక్ట్, నదులు, కాలువల ద్వారా ప్రజా రవాణాను మెరుగుపరుస్తుంది. కొచ్చి మోడల్‌ను అనుసరించి, ఈ ఎలక్ట్రిక్/హైబ్రిడ్ బోట్‌లు కాలుష్యం, శబ్దం లేకుండా నడుస్తాయి. ఇది భారత భవిష్యత్ రవాణా ముఖచిత్రాన్ని మార్చేస్తుంది.

ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశవ్యాప్తంగా నీటి వనరులను ఉపయోగించుకుంటూ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ. 9,280 కోట్లతో భారీ ‘వాటర్ మెట్రో’ ప్రాజెక్టును సిద్ధం చేస్తోంది. ఇది కేవలం పర్యాటకం కోసం ఉపయోగించే పడవ ప్రయాణం కాదు. మెట్రో రైలు తరహాలోనే పక్కా ప్రణాళికతో సాగే ప్రజా రవాణా వ్యవస్థ. నదులు, కాలువలు, సరస్సుల గుండా నగర వాసులు ఆఫీసులకు, ఇతర పనులకు వేగంగా వెళ్లేలా దీన్ని రూపొందించారు. ఇప్పటికే కేరళలోని కొచ్చిలో విజయవంతమైన ఈ మోడల్‌ను ఇప్పుడు దేశవ్యాప్తంగా 18 నగరాల్లో అమలు చేయాలని కేంద్ర ఓడరేవుల, నౌకాయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, కోల్‌కతా వంటి నగరాలతో పాటు దక్షిణ భారతదేశంలోని అమరావతి, ముంబై, మంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలను ఎంపిక చేశారు. ఒక్కో ప్రాజెక్టుకు సుమారు రూ.800 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల వరకు వ్యయం కానుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో నిధులను భరిస్తాయి. ఈ వాటర్ మెట్రో బోట్లు పూర్తిగా ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ పద్ధతిలో నడుస్తాయి. దీనివల్ల కాలుష్యం ఉండదు, శబ్దం రాదు. 2026 ఏప్రిల్ నుంచి 10 ఏళ్ల పాటు ఈ పథకం కొనసాగనుంది. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు, ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ఈ ప్రాజెక్టు భవిష్యత్ రవాణా ముఖచిత్రాన్ని మార్చేయనుంది..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్‌ ఆలోచన

ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు

జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీల్లో గుండె ఝల్లుమనిపించే దృశ్యాలు

అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు.. భయాందోళనలో జనం

వెబ్ యూజర్లకు శుభవార్త.. ఇక బ్రౌజర్ నుండే నేరుగా వీడియో, ఆడియో కాల్స్