పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్ ఆలోచన
పల్నాడు జిల్లా వైకుంఠపురంలో డ్రోన్ సాయంతో చైన్ స్నాచర్‌ను పట్టుకున్న ఘటన ఆధునిక సాంకేతికత నేర నివారణలో ఎంత కీలకమో నిరూపించింది. పొలాల్లో దాక్కున్న నిందితుడిని గ్రామస్తులు సమయస్ఫూర్తితో డ్రోన్ ద్వారా గుర్తించి, పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన నేరగాళ్లకు చెక్ పెట్టడంలో సాంకేతికత ఆవశ్యకతను తెలియజేస్తుంది.
ఆధునిక సాంకేతికత తోడైతే నేరగాళ్ల ఆట కట్టించడం ఎంత సులభమో పల్నాడు జిల్లా వైకుంఠపురంలో జరిగిన ఘటనతో రుజువైంది. పొలాల్లో దాక్కున్న చైన్ స్నాచర్‌ను స్థానికులు డ్రోన్ సాయంతో పట్టుకొని పోలీసులకు అప్పగించిన తీరు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. నర్సరావుపేటకు చెందిన ఓ వృద్ధురాలు రేపల్లె సమీపంలోని కృష్ణా తీరంలోని వైకుంఠపురం భవఘ్ని స్వామి ఆశ్రమానికి వెళ్లేందుకు బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తోంది, ఇంతలో హెల్మెట్ ధరించిన ఓ యువకుడు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకొని పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు దొంగను వెంబడించారు. పారిపోయే దారి లేక సదరు నిందితుడు బైక్ వదిలేసి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి దాక్కున్నాడు. చుట్టూ కృష్ణా నది, దట్టమైన పొలాలు ఉండటంతో దొంగను వెతకడం కష్టంగా మారింది. అయితే, స్థానికులు సమయస్ఫూర్తితో గ్రామంలోని ఓ ఫోటోగ్రాఫర్‌ను పిలిపించి, అతని వద్ద ఉన్న డ్రోన్ సాయంతో గాలింపు చేపట్టారు. కొద్దిసేపటికే డ్రోన్ కెమెరాలో నిందితుడు నక్కి ఉన్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని చుట్టుముట్టి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని గుంటూరు సమీపంలోని జొన్నలగడ్డకు చెందిన నాగార్జునగా పోలీసులు గుర్తించారు. అతని పాత నేర చరిత్రపై, వాడుతున్న బైక్ వివరాలపై ఆరా తీస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరగాడిని పట్టుకున్న గ్రామస్థులను పోలీసులు, బాధితురాలు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు
జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీల్లో గుండె ఝల్లుమనిపించే దృశ్యాలు
అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు.. భయాందోళనలో జనం
వెబ్ యూజర్లకు శుభవార్త.. ఇక బ్రౌజర్ నుండే నేరుగా వీడియో, ఆడియో కాల్స్
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
దంచి కొట్టనున్న ఎండలు.. మార్చి నుంచే ప్రారంభం!
పాతబస్తీలో మాయమవుతున్న పొట్టేళ్లు..ఏమవుతున్నాయో తెలుసా?
ఆకాశంలో అద్భుతం.. గ్రహణం వేళ బ్లడ్ మూన్ కనువిందు

